INDIA bloc: మేమంతా కలిసే ఉన్నాం, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వస్తాం..
- ఇండియా కూటమి ఐక్యంగానే ఉంది..
- మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు వస్తాం..
- కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు.
Read Also: Asteroid: భూమికి ప్రమాదం.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం..
Also Read
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, రాష్ట్ర స్థాయి ఎన్ని్కల్లో పోటీలకు ప్రతీ పార్టీ సొంతగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉందని శుక్లా చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత చెక్కుచెదరలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసి ఆప్ ఓట్లను చీల్చిందనే వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. ప్రతీ ఎన్నికల్లో ఓట్ల విభజన జరుగుతుందని చెప్పారు.
తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల ఆప్ అధికారానికి బ్రేక్ వేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిస్తే, ఆప్ 22 సీట్లను కైవసం చేసుకుంది. 67 చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!