Asteroid: గ్రహశకలాలు భూమికి ఎప్పటికీ ప్రమాదకరంగానే ఉంటాయి. కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఒక ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టడంతో డైనోసార్లు అంతరించి పోయాయి. నిజానికి ఈ గ్రహశకలాలే భూమి పైకి నీరు తీసుకువచ్చాయనే వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2024 YR4 గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం కక్ష్య గమనాన్ని నాసా అంచనా వేసింది.
Read also: Anakapalle: తీవ్ర విషాదం.. సముద్రంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు..
నాసా యొక్క సెంటర్ ఆఫ్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) ఆ గ్రహశకలాన్ని ట్రాక్ చేస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం, ఇది భూమికి 1,06,200 కి.మీ పరిధిలోకి వస్తుందని అంచనా. అయితే, శాస్త్రవేత్తలు దీని కదలికల్ని అంచనా వేయడానికి నిశితంగా పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తోంది. గ్రహానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఇది గంటకు 40,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని అంచనా.
దాదాపుగా 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభ సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఈ గ్రహశకలాలు ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఇవి భూమి వైపుగా దూసుకువస్తుంటాయి. ఈ గ్రహశకలాలు కుజ-గురు గ్రహాల మధ్యలోని ఆస్టారాయిడ్ బెల్ట్‌లో ఉంటాయి. గుళకరాళ్ల సైజు నుంచి వందల కి.మీ వ్యాసం కలిగిన గ్రహశకలాలు ఉంటాయి.