Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. అనేక నిర్ణయాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన ఉక్రెయిన్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావచ్చు’’ అని అన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కలవడానికి కొన్ని రోజులు ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
MP Horror: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బంధువులే 19 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను 15 అడుగులు ఎత్తైన టెర్రస్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌లో జరిగింది. యువతి బంధువులే, పొరుగింటి వారి టెర్రర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నేరంలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Modi: పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు.
Massive Traffic Jams: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్తున్నారు. దీంతో కుంభమేళాకు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ ఎదురయ్యయాయి. వేలాది మంది భక్తులు రాత్రంతా హైవేపై గడపాల్సి వచ్చింది.
AAP: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ని మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. అయితే, ఈ ఊహాగానాలపై మాన్ నవ్వుతూ స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో జరిగిన పంజాబ్ ఎమ్మెల్యేల సమావేశం రాజకీయ వేడిని పుట్టించింది.
China: చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది. ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20% క్షీణత నమోదైందని,
Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో […]
WhatsApp Marriage: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్లి సంచలనంగా మారింది. వాట్సాప్‌లో ఓ జంట పెళ్లి చేసుకోవడం వార్తల్లో నిలిచింది. అయితే, వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, యువతీయువకులు మాత్రం పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా కలిసి ఉండేందుకు పట్టుబడుతున్నారు.
Human Brain: మనం చనిపోయే ముందు, మన శరీరంలో, ముఖ్యంగా మన మెదడులో ఎలాంటి పనులు జరుగుతాయనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టని విషయమే. దీనిపై అనేక ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘ఎన్‌హ్యాన్స్ ఇంటర్‌ప్లే ఆఫ్ న్యూరోనల్ కోహరెన్స్ అండ్ కప్లింగ్ ఇన్ ది డైయింగ్ హ్యూమన్ బ్రెయిన్’’ అనే పేరుతో ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరో సైన్స్ జర్నల్‌లో మెదడు అధ్యయనానికి సంబంధించిన కీలక విషయాలను ప్రచురించారు.
Infosys Layoffs: గ్యాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే సగటు వ్యక్తి ఆశ సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించడం, లక్షల్లో ప్యాకేజీలు అందుకోవడం, ఫ్లాట్లు, కార్లు ఇలా ఎన్నో ఆశలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యువత సాఫ్ట్వేర్ ఆశలు ఆవిరి అవుతున్నాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, దేశీయ టెక్ దిగ్గజం ‘‘ఇన్ఫోసిస్’’ ఏకంగా 700 మంది ఫ్రెషర్లను ఒకేసారి తొలగించడం సంచలనంగా మారింది.