Jaish-e-Mohammad (JeM): పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న తన రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు భారత్ రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పర్యటనకు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు పుతిన్ బస చేయబోతున్న ఐటీసీ మౌర్య హోటల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ ఈ విలాసవంతమైన హోటల్లోనే బస చేయబోతున్నారు. ఇప్పటికే, రష్యన్ […]
Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు సాయంత్రం భారత్‌లో తన రెండు రోజుల పర్యటన కోసం అడుగుపెట్టనున్నారు. పుతిన్ పర్యటనకు ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Techie Suicide: నగర పాలక సంస్థ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించాడు. కొత్త ఇంటి నిర్మాణానికి పదే పదే ఆటంకాలు కలిగించడం, డబ్బులు వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.
Wedding: పెళ్లిలో వరుడు, వధువు బంధువులు ఘర్షణకు దిగిన ఘటన బీహార్ లోని బోధ్ గయాలో జరిగింది. కేవలం ‘‘రసగుల్లా’’ తక్కువైందని ఇరు వర్గాలు రచ్చరచ్చ చేశారు. ఇరువైపుల నుంచి కుటుంబ సభ్యులు, అతిథులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు, కుర్చీలతో దాడులు చేసుకున్నారు.
MH370 Mystery: మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన MH370 మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విమానం అదృశ్యమై 11 ఏళ్లు అవుతున్నా, అసలు ఈ విమానానికి ఏమైంది, ఎక్కడ కూలిపోయింది అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. విమానానికి సంబంధించిన శకలాలు, ప్రయాణికుల మృతదేహాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే, మరోసారి ఈ విమానం కోసం అన్వేషణ తిరిగి ప్రారంభిస్తామని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అనేక సార్లు విమానాన్ని కనుగొనడంలో తమ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, మరోసారి అణ్వేషించడానికి […]
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
Shocking M*urders: తన కన్నా ‘‘అందం’’గా ఉంటే జీర్ణించుకోలేని మనస్తత్వం ఒక మహిళను క్రూరురాలిగా మార్చింది. చిన్న పిల్లలు అని చూడకుండా పసిపిల్లల్ని దారుణంగా హత్య చేసింది. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన 6 ఏళ్ల చిన్నారి మరణాన్ని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు.
Bangladesh: భారతదేశం ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు ‘‘పూర్తి శాంతి’’ లభిస్తుందని బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ జనరల్ అన్నారు.ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో జమాతే-ఇ-ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.