Realme Buds Air 8: రియల్‌మీ (realme) భారత్‌లో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (TWS) రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 (Realme Buds Air 8)ను అధికారికంగా విడుదల చేసింది. ముందుగా చెప్పినట్లుగానే ఎయిర్ (Air) సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ కొత్త TWS ఇయర్‌బడ్స్ ఆధునిక ఆడియో టెక్నాలజీతో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తున్నాయి.
ఈ బడ్స్ లో 11mm వూఫర్ + 6mm మైక్రో-ప్లేన్ ట్వీటర్తో కూడిన 11+6mm ప్రీమియర్ డ్యూయల్ డ్రైవర్ సెటప్ను అందించారు. డ్యూయల్ DAC ఆడియో ప్రాసెసింగ్ చిప్స్, N52 NdFeB మాగ్నెట్లు, 100% హై ప్యూరిటీ డయాఫ్రామ్‌తో క్లియర్ బాస్, షార్ప్ ట్రెబుల్ అందిస్తుంది. ఇవి LHDC 5.0 / LDAC వంటి హై-రిజల్యూషన్ ఆడియో కోడెక్స్‌ను సపోర్ట్ చేస్తాయి. Hi-Res సర్టిఫికేషన్‌తో పాటు NextBass అల్గోరిథం, 3D స్పేషల్ & డైనమిక్ ఆడియో ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
అలాగే ఇందులో 55dB వరకు ఇంటెలిజెంట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉంది. అంతేకాకుండా 6 మైక్ AI నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ తో కాల్స్ సమయంలో క్రిస్టల్ క్లియర్ వాయిస్ అందుతుంది. గేమర్స్ కోసం 45ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. వీటితోపాటు AI Voice Assistant 2.0ను అందించారు. ఇది గూగుల్ జెమినీ ద్వారా పనిచేస్తాయి. ఇందులో AI లైవ్ ట్రాన్స్‌లేటర్, ఫేస్-టు-ఫేస్ ట్రాన్స్‌లేషన్ వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లు ఉండడం విశేషం.

ప్రముఖ ఇండస్ట్రియల్ డిజైనర్ నావోటో ఫుకసావా (Naoto Fukasawa)తో కలిసి రూపొందించిన నేచర్ టచ్ (Nature-Touch) మాస్టర్ డిజైన్ ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత. జియోమెట్రిక్ త్రీ-పార్ట్ కేస్, రౌండెడ్ కార్నర్స్‌తో పాటు బయో-బేస్డ్ ఆర్గానిక్ సిలికోన్ మెటీరియల్ వాడటం వల్ల స్కిన్-సాఫ్ట్, ఎకో-ఫ్రెండ్లీ ఫీల్ అందుతుంది.
Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?
ఇక ఇందులో బ్లూటూత్ 5.4, IP55 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ (ఇయర్‌బడ్స్ మాత్రమే), ఇయర్‌బడ్స్ 62mAh, కేస్ 530mAh బ్యాటరీ ఉన్నాయి. ఇవి ANC ఆఫ్‌లో 58 గంటల వరకు బ్యాకప్, 10 నిమిషాల ఛార్జ్‌తో 11 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇవి మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, మాస్టర్ పర్పుల్ రంగుల్లో లభించనున్నాయి. వీటి అసలు ధర రూ. 3,799 కాగా.. ఫస్ట్ సేల్‌లో రూ. 3,599కే అందుబాటులో ఉంటాయి. జనవరి 16 నుంచి realme.com, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.