Venezuela: అమెరికా వెనిజులాపై దాడి చేసి, ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరాను పట్టుకెళ్లారు. వీరిద్దరిని సొంత దేశం నుంచి అమెరికా తరలించారు. అమెరికన్ న్యాయ వ్యవస్థ ముందు వీరిని ప్రవేశపెడుతామని అక్కడి అధికారులు చెబుతున్నారు. నార్కో -టెర్రరిజం, అక్రమ ఆయుధాలు వంటి కేసులన్ని మదురోపై మోపారు. శనివారం తెల్లవారుజామున యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ కేవలం 30 నిమిషాల ఆపరేషన్‌లోనే వీరిద్దరిని నిర్బంధించినట్లు తెలుస్తోంది.
అయితే, ఇంత జరుగుతున్న వెనిజులా సైన్యం ఏం చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కట్టుదిట్టంగా ఉండే, కరాకస్‌లోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని మదురో నివాసం నుంచి ఇద్దరిని బంధించారు. ఇంత భద్రత ఉన్నా కూడా, వెనిజులా సైన్యం నుంచి ఎలాంటి ప్రతీకార దాడులు లేకపోవడం, ఒక్క యూఎస్ సైనికుడు కూడా చనిపోవపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also: KTR: నాకు నాలుగు భాషల్లో తిట్లువచ్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ కౌంటర్..
కొంత మంది విశ్లేషకుల ప్రకారం, మదురోను పట్టించడంలో ఆయన సన్నిహితులే సాయం చేసినట్లు తెలుస్తోంది. అంతర్గత వ్యక్తుల సహాయంతోనే యూఎస్ ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. అదే సమయంలో వెనిజులా సైన్యంలోని పలువురిని అమెరికా తన గుప్పిట పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కీలక సమయంలో, వెనిజులా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పనిచేయకుండా పోయాయి. అమెరికన్ హెలికాప్టర్లు, విమానాలు వచ్చినప్పటికీ వాటి ఎయిర్ డిఫెన్స్ పనిచేయకపోవడం అనుమానాలను బలపడేలా చేస్తోంది.
అమెరికా దాడుల్ని ఎదుర్కొనేందుకు రష్యా నుంచి వెనిజులా Buk-M2Eని కొనుగోలు చేసినప్పటికీ, శనివారం తన భూభాగంలో US సైనిక దాడుల తర్వాత వెనిజులా ప్రతీకారం తీర్చుకోకపోవడం ఆశ్చర్యకరం. రష్యన్ రక్షణ వ్యవస్థల్ని కీలక సమయంలో ఉపయోగించలేదు. వెనిజులా కొన్ని నెలల క్రితం రష్యాలో తయారు చేయబడిన Buk-M2E (NATO: SA-17 Grizzly)ని దాని వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లో అనుసంధానించింది. ఇది రాజధాని కారకస్ సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. ఇది స్టెల్త్ ఫైటర్లు, తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణులను అడ్డుకోగలదు. 45 కి.మీ దూరం, 25 కి.మీ ఎత్తు నుంచి వచ్చే ప్రమాదాలను గుర్తించి, దాడులు చేయగలు. అయినా కూడా ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేశారనే అనుమానం వస్తుంది.