Nicolas Maduro: వెనిజులాపై అమెరికా దాడులు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. వెనిజులాపై ట్రంప్ ప్రభుత్వం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి, అమెరికాకు తరలించారు. యూఎస్‌లో డ్రగ్స్ వ్యాప్తికి మదురో సహకరిస్తున్నారని, డ్రగ్స్ ముఠాలతో ఆయనకు సంబంధం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఆయనపై నార్కో టెర్రరిజం, ఆయుధ ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే, గతంలో ట్రంప్‌ను మదురు ఛాలెంజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అరెస్ట్‌కు నెలల ముందు, మదురో మాట్లాడుతూ.. నన్ను వచ్చి పట్టుకోండి అంటూ సవాల్ చేశాడు. ‘‘నన్ను పట్టుకోండి. నేను మిరాఫ్లోర్స్‌లో అతని కోసం వేచి ఉంటాను. పిరికివాడా, ఆలస్యం చేయకు’’ అని ఆగస్టులో ట్రంప్‌కు మదురో ఛాలెంజ్ విసిరాడు. అయితే, ఈ వీడియోను వైట్ హౌజ్ ఎక్స్‌లో షేర్ చేసింది.
Read Also: Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ రెసిపీ.. జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
వైట్ హౌజ్ షేర్ చేసిన వీడియోలో.. మదురో తనను పట్టుకోండి అని సవాల్ విసిరే ఫుటేజ్‌తో పాటు శనివారం అమెరికా దాడులను చూపించింది. 61 సెకన్ల క్లిప్‌లో వెనిజులా దాడులపై ట్రంప్ ప్రెస్ బ్రీఫింగ్ దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. మదురోకు అవకాశం ఇచ్చాం, కానీ ఆ అవకాశం పోయిందని వ్యాఖ్యానించారు.
డొనాల్డ్ ట్రంప్ “ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసోల్వ్” ఆపరేషన్ నిర్వహించి, మదురోను పట్టుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆర్మీ డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ నిర్వహించారు. 30 నిమిషాల్లోనే మదురోను బంధించారు. ఆయన తన స్టీల్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్ట్ చేశారు. మదురో నివాసం ఎలా ఉంటుందో తెలుసుకుని, దానిని నిర్మించి సైనికులు ట్రయల్స్ చేశారు.
Nicolas Maduro had his chance — until he didn’t.
The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4
— The White House (@WhiteHouse) January 4, 2026