కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. అయితే.. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, తన రాజీనామా లేఖను ఇప్పటికే శాసనమండలి చైర్మన్‌కు సమర్పించారు. ఈ నేపథ్యంలో, సోమవారం శాసనమండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఆ పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం నైతికంగా సరికాదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. నిజానికి తాను గతేడాది సెప్టెంబర్ లోనే రాజీనామా లేఖను సమర్పించినట్లు గుర్తుచేసిన కవిత, దాన్ని వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు. అయితే, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయంపై స్పందిస్తూ, భావోద్వేగంతో రాజీనామాలు చేయవద్దని, మరోసారి పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించారు. అయినప్పటికీ, తన రాజీనామాకే కట్టుబడి ఉన్నానని కవిత తెలపడం గమనార్హం.
అయితే.. తాజాగా మంగళవారం మండలి నిరవధిక వాయిదా పడింది. ఈ క్రమంలోనే కవిత రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. మండలిలో వీడ్కోలు ప్రసంగం ముగించిన అనంతరం ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, తన సొంత సంస్థ ‘తెలంగాణ జాగృతి’ని ఒక రాజకీయ వేదికగా మార్చి ప్రజల్లోకి వెళ్తానని వెల్లడించారు. 2028-29 ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
MSVG: “రౌడీ అల్లుడు వైబ్ తిరిగి తెచ్చాం!” – మెగాస్టార్ వింటేజ్ ఫుల్ ప్యాక్ సినిమా ఇదే!