Rajnath Singh: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘‘బాబ్రీ మసీదు’’ను తిరిగి నిర్మించేందుకు ప్రజా ధనాన్ని ఉపయోగించాలని అనుకున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Modi Farming Mantra: సహజ వ్యవసాయంపై ప్రధాని నరేంద్రమోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. లింక్డ్ఇన్ పోస్టులో సహజ వ్యవసాయం గొప్పతనాన్ని ఆయన వివరించారు. సహజ వ్యవసాయం అనేది ఆధునిక పర్యావరణ శాస్త్రాలను సమన్వయం చేసుకుని, ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు లేకుండా పంటలను పండించే ఒక విధానం. ఇందులో ఒకే క్షేత్రంలో పంటలు, చెట్లు, పశువులు కలిసి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయి. బయట నుంచి ఎరువులు, మందుల వంటివి వాడకుండా, ఆ వ్యవసాయ క్షేత్రంలో లభించే పేడ, పచ్చిరొట్ట వంటి వాటివి వినియోగించుకుని, మల్చింగ్…
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నునంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.
Putin: డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ‘‘దోస్తీ’’ గురించి మాట్లాడుతూనే, యూరప్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ దిగుమతులను పెంచడం గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని పుతిన్ చెప్పారు. భారత్, చైనాతో సహా కీలక భాగస్వాములతో రష్యా ఆర్థిక సంబంధాలు మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. VTB ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’(Tesla) భారత్‌లో తన సత్తా చాటలేకపోతోంది. సగటు భారతీయులు ఈ కార్లను కొనేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. భారత మార్కెట్లో టెస్లాకు అంత ఈజీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో టెస్లా ఇండియాలోకి ప్రవేశించింది. తన మోడల్ Y(Model Y)ని విక్రయిస్తోంది. అయితే, వీటి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి.
Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్‌కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీ
CJI Surya Kant: తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు.