Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మైదానంలోకి సూపర్ రీఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆరో రౌండ్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 82 పరుగులు చేశాడు. గాయం తర్వాత తొలిసారి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కుశాల్ పాల్ బౌలింగ్‌లో అమన్‌ప్రీత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
READ ALSO: Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..
కీలకమైన సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 82 పరుగులు చేశాడు. ముంబై తరుఫున జైస్వాల్ 18 బంతుల్లో 15 పరుగులకే ఔటయ్యాడు, సర్ఫరాజ్ ఖాన్ 10 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ ముషీర్ ఖాన్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయ్యర్ నెమ్మదిగా మొదలుపెట్టి, 18 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత గేర్ మార్చి పరుగుల వరద పారించాడు. తన ఇన్సింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 3 సిక్సర్లతో ప్రత్యర్థి టీంపై విరుచుకుపడ్డారు. నిజానికి శ్రేయాస్ అయ్యర్‌కి ఈ మ్యాచ్ ఒక పరీక్ష లాంటిది. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అయ్యర్ ఎంపికైనప్పటికీ, ఈ విజయ్ హజారే ట్రోఫీలో ప్రదర్శన కీలకంగా మారింది. అందుకే ఈ ట్రోఫీలో ఆడి తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని BCCI శ్రేయస్‌ను కోరినట్లు టాక్, ఇప్పుడు ఈ స్టార్ తన ఫిట్ నెస్‌తో పాటు తన ఫామ్‌ను కూడా నిరూపించుకున్నాడు.
READ ALSO: Redmi Pad 2 Pro 5G: ల్యాప్‌టాప్‌ను రిప్లేస్ చేస్తున్న ట్యాబ్..