HONOR Power2: హానర్ (HONOR) చైనాలో కొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ HONOR Power2ను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అత్యాధునిక ప్రాసెసర్, ఫ్లాగ్‌షిప్ స్థాయి డిస్‌ప్లేతో ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
HONOR Power2లో 6.79 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్టంగా 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో అవుట్‌డోర్ వినియోగంలో కూడా అద్భుతమైన విజువల్ అనుభవం లభిస్తుంది. HDR కంటెంట్‌కు ఇది పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ కొత్తగా విడుదలైన MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో సుమారు 24 లక్షల స్కోర్ సాధించడంతో ఇది అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలిచింది. 12GB LPDDR5X ర్యామ్‌తో పాటు 256GB, 512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..
ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 10080mAh నాల్గో తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ. 10,000mAh క్లబ్‌లోకి వచ్చిన రెండో HONOR ఫోన్ ఇదే కావడం విశేషం. ఆరు సంవత్సరాల పాటు బ్యాటరీ డ్యూరబిలిటీని కంపెనీ హామీ ఇస్తోంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు కేవలం 216 గ్రాములు మాత్రమే ఉండటం, మందం 8mm కంటే తక్కువగా ఉండటం ప్రత్యేకగా చెప్పవచ్చు. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

డిజైన్, డ్యూరబిలిటీ విషయంలో HONOR Power2 మరో అడుగు ముందుంది. ఇది గోల్డ్ లేబుల్ త్రీ-ప్రూఫ్ సర్టిఫికేషన్, SGS ఫైవ్ స్టార్ రిలయబిలిటీ సర్టిఫికేషన్ పొందింది. డ్రాప్, షాక్, కాంప్రెషన్‌లకు ఇది బలంగా నిలుస్తుంది. ఇంకా IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్‌తో హై ప్రెజర్ వాటర్ గన్, 85 డిగ్రీల వరకు వేడి నీటిలో ముంచినా నష్టం కలగదని కంపెనీ చెబుతోంది. సన్ రైజ్ ఆరంజ్, స్నో వైట్, ఫాంటమ్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
Trent Share: 2 నిమిషాల్లో రూ.162 కోట్లు పోగొట్టుకున్న బిలియనీర్.. మార్కెట్‌ను ముంచిన ట్రెంట్ షేర్లు
కనెక్టివిటీ పరంగా కూడా ఈ ఫోన్ టాప్ క్లాస్. హానర్ స్వయంగా అభివృద్ధి చేసిన C1+ RF ఎన్‌హాన్స్‌మెంట్ చిప్, పవర్ సిగ్నల్ ఐలాండ్ డిజైన్, ప్యారలల్ డ్యూయల్-రైల్ యాంటెన్నా వ్యవస్థలతో వీక్ నెట్‌వర్క్ సిగ్నల్ స్ట్రెంగ్త్‌ను 200 శాతం వరకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. 5G SA/NSA, Wi-Fi 6, Bluetooth 6.0, NFC, NavIC సహా అన్ని ప్రధాన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్‌కు మద్దతు ఉంది.
కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OISతో)తో పాటు 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0పై పనిచేస్తుంది. ధరల విషయానికి వస్తే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2699 యువాన్ (రూ. 34,800), 12GB + 512GB వేరియంట్ ధర 2999 యువాన్ (రూ. 38,700)గా ఉంది. ఈ ఫోన్ జనవరి 9 నుంచి చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.