Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు.
NDA: ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
BJP MP: పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పలువురు రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పహల్గామ్ ఉగ్రదాడిపై చేసిన కామెంట్స్‌పై వివాదం చెలరేగింది. ఉగ్రవాద దాడి సమయంలో మహిళలు తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులుగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సిందని ఆయన అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.
Pakistan: భారత్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మిత్రదేశాల పర్యటనకు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి యత్నించింది. దీనికి బదులుగా పాక్ లోని 11 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసి గట్టి బుద్ధి చెప్పింది. Read Also: […]
Mysuru Suicide: కర్ణాటక రాష్ట్రం మైసూరు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ కుటుంబాన్నే బలి తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు చిన్న కూతురు హెబ్బల్హా జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అనుష్క యాదవ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని శనివారం ఫేస్బుక్ పోస్ట్ ద్వారా బయటపెట్టాడు. అనుష్క యాదవ్ గత 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.
X Outage: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘‘ఎక్స్’’ శనివారం తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటెంట్ పోస్టింగ్‌లో అంతరాయం ఎదురైనట్లు యూజర్లు పేర్కొన్నారు. ఈ అంతరాయంపై డౌన్‌డిటెక్టర్ 2,100 కి పైగా సమస్యలను నివేదించింది. వినియోగదారులు సైన్ ఇన్ చేయడంలో ఇబ్బంది పడటంతో పాటు నేరుగా సందేశాలను అందుకోకపోవడం వంటి వివిధ సమస్యలను ఎదుర్కొన్నారు. అనేక మంది వినియోగదారులు తమ లింక్స్ తెగిపోయినట్లు నివేదించారు. లాగిన్ అవ్వడం, కొత్త పోస్టులు లోడ్ చేయడం వంటి […]