Bangladesh: బంగ్లాదేశ్‌లో ‘‘రఖైన్ కారిడార్’’ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ప్రాంతం నుంచి మయన్మార్ రఖైన్ రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’ అంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ మాత్రం తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎన్నికలు లేకుండా మరో 5 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సైన్యం ఎన్నికల కోసం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై యూనస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. సైన్యం ఒత్తిడి మధ్య ఆయన రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ‘‘ముందు సంస్కరణలు, ఆ తర్వాతే ఎన్నికలు’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో యూనస్‌కి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి. యూనస్‌ని 5 ఏళ్లు అధికారంలో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఢాకా వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు.
Read Also: Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కేసు..
గతేడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, యూనస్ బంగ్లా అధినేతగా మారారు. అయితే, అప్పటి నుంచి ఆయన విధానాల పట్ల ఆర్మీ తీవ్ర అసంతృప్తితో ఉంది. పలు సందర్భాల్లో యూనస్‌కి ఆర్మీ చీఫ్ వకార్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. యూనస్ ఆర్మీ వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు పాకిస్తాన్‌తో మిత్రుత్వం, భారత్‌తో శత్రుత్వాన్ని కొనసాగించడం ఆర్మీకి నచ్చడం లేదు. అయితే, యూనస్‌కి అమెరికా అండ ఉందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల్ని దాటవేస్తూ, రోహింగ్యా కారిడార్‌కి యూనస్ మద్దతు తెలుపుతున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కారిడార్‌ని యూఎన్ ద్వారా అమెరికా ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్‌లో ఏర్పడి రాజకీయ గందరగోళం మధ్య ఈ రోజు ఢాకాలో ‘‘మార్చ్ ఫర్ యూనస్’’ పేరిట భారీ ర్యాలీ చేశారు. గతేడాది, విద్యార్థి ఉద్యమంలో కీలకంగా ఉన్న విద్యార్థి నేత నహిద్ ఇస్లాంతో యూనస్ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.