Covid cases: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకోగ్) డేటా ప్రకారం, దేశంలో రెండు కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన పెంచుతోంది. NB.1.8.1, LF.7 అనే వేరియంట్లు ఇటీవల భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 కేసు ఒకటి నమోదైంది, మేలో నాలుగు LF.7 కేసులను గుర్తించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన జరిగింది. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆమెపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది.
High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
BrahMos missile: ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉపయోగించిన ‘‘బ్రహ్మోస్ మిస్సైల్స్’’ శక్తిని ప్రపంచమంతా చూసింది. ముఖ్యంగా, పాకిస్తాన్ కి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై దాడుల్లో బ్రహ్మోస్ పనితనం బయటపడింది. అయితే, ఇప్పుడు అడ్వాన్సుడ్ బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ కోసం భారత్, రష్యాలు చర్చలు జరుపుతున్నాయి.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఉగ్ర ఘటన తర్వాత, పాశ్చాత్య మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, వెస్ట్రన్ దేశాల ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడి చేస్తుంటే, వింత ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ప్రజల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల ముందు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ని 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత, లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. ఈ వివాదంపై తేజస్వీ మాట్లాడుతూ.. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉందని అన్నారు. కానీ తన సోదరుడి…
PM Modi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేడీ నడ్డా హాజరయ్యారు. ఈ
India Russia: భారత్, రష్యాతో మరో బిగ్ డీల్‌కి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ రష్యా పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ మిస్సైల్స్ పాకిస్తాన్‌ని కాళ్ల బేరానికి తెచ్చాయి.
Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి చేసింది. మొత్తం 367 డ్రోన్లను, క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. అయితే, ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చేవేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది. Read Also: […]
US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.