Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..
- ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కి భారీ నష్టం..
- ఏకంగా 3.3 బిలియన్ డాలర్లు ఆవిరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్‌కి నొప్పి తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలతో పాటు దాని మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ముఖ్యంగా, పాక్ వైమానిక దళానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్(OSINT) పాకిస్తాన్ నష్టాన్ని అంచనా వేసింది. పాకిస్తాన్ ఎయిర్, గ్రౌండ్, వార్ రెడీ నెస్ ఇలా ప్రతీదాంట్లో కూడా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. మొత్తంగా చూస్తే ఏప్రిల్-మేలో పాకిస్తాన్ ఏకంగా 3.36 బిలియన్ డాలర్లను నష్టపోయింది. మన కరెన్సీలో సుమారుగా రూ. 28,000 కోట్లు నష్టపోయింది.
భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ 08 ఎఫ్-16 యుద్ధవిమానాలు, నాలుగు జేఎఫ్-17 యుద్ధ విమానాలు కోల్పోయింది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
వైమానిక పోరాట నష్టాలు:
పాక్ వైమానిక దళాన్ని భారత్ చాలా వరకు ధ్వంసం చేసింది. నాలుగు ఎఫ్-16లను కోల్పోయింది. వీటి ధర ఒక్కొక్కదానికి 87.38 మిలియన్ డాలర్లు (మొత్తం $349.52 మిలియన్లు), $349.52 మిలియన్లు విలువైన సాబ్ 2500 ఎరిఐ అవాక్స్ సిస్టమ్, $35 మిలియన్ల విలువైన IL-78 ఎరియల్ రిఫ్యూలింగ్ విమానం, $3.2 మిలియన్లు మరియు $8 మిలియన్లు విలువైన రెండు CM-400AKG క్షిపణులను, రెండు షాహీన్-క్లాస్ క్షిపణులను కోల్పోయింది. దీనికి తోడుగా టర్కీ నుంచి కొనుగోలు చేసిన 6 బైరాక్టర్ TB2 డ్రోన్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా చూస్తే ఎరియల్ కాంబాక్ట్ నష్టాలే $524.72 మిలియన్లుగా ఉంది.
ఉపరితల పోరాట నష్టాలు:
భారత్ , పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్లో మరో నాలుగు F-16 బ్లాక్ 52D విమానాలు కోల్పోయింది. దీని వలన $349.52 మిలియన్ల నష్టం వాటిల్లింది. $40 మిలియన్ల విలువైన C-130H హెర్క్యులస్ రవాణా విమానం, $200 మిలియన్ల విలువైన అత్యంత అధునాతన HQ-9 ఉపరితలం నుండి గగనతల క్షిపణి (SAM) బ్యాటరీని కోల్పోయింది. రెండు మొబైల్ కమాండ్ సెంటర్లను కూడా భారత్ న్యూట్రలైజ్ చేసింది. వీటి మొత్తం విలువ 10 మిలియన్ డాలర్లు. మొత్తం మీద పాకిస్తాన్ $10 మిలియన్ల గ్రౌండ్ అసెట్స్‌ని కోల్పోయింది.
ఎయిర్+గ్రౌండ్ నష్టాలను కలిపితే పాకిస్తాన్ దాదాపుగా 1.124 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
ఆపరేషన్ రెడీనెస్ ఖర్చులు:
భారత్ దాడి చేస్తుందని తెలిసి, పాకిస్తాన్ సైన్యం 29 రోజులు పాటు వైమానిక గస్తీతో పాటు సరిహద్దుల్లో భారీగా మోహరించింది. డ్రోన్ మిషన్లను విస్తరణ, డ్రోన్ దాడులకు $450 మిలియన్లు ఖర్చయ్యాయి. 24 గంటలూ సరిహద్దు సమీకరణ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లాజిస్టిక్స్ మరియు రాడార్ యాక్టివేషన్‌లకు $435 మిలియన్లు ఖర్చయినట్లు అంచనా. ఈ కార్యాచరణ కార్యకలాపాలకు కలిపి $1.61 బిలియన్లు ఖర్చైంది.
ఎయిర్‌బేస్ నష్టం:
భారత్ జరిపిన భీకర దాడుల్లో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద కీలకమైన అవాక్స్ షెల్టర్లు, నియంత్రణ కేంద్రాలు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు 125 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా. సర్గోదా ఎయిర్‌బేస్‌లో రాడార్ వ్యవస్థలు, F-16 కమాండ్ బేలకు నష్టం వాటిల్లడం వల్ల పునర్నిర్మాణ ఖర్చులు $100 మిలియన్లకు పైగా అవసరం. మొత్తంమీద, మౌలిక సదుపాయాల నష్టం $225 మిలియన్లుగా అంచనా.
అన్ని నష్టాలను కలుపుకుంటే 3.3 బిలియన్ డాలర్లను పాకిస్తాన్ నష్టపోయింది. ఇది ప్రత్యక్ష నష్టం కాగా, పరోక్షంగా పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర నష్టాల పాలైంది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ దారుణమైన నష్టాలను చవిచూసింది. వీటిని కూడా కలుపుకుంటే పాకిస్తాన్ 18-22 బిలియన్ డాలర్లను నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!