BJP: కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో అధికారం బీజేపీదే..
- రెండేళ్లలోనే ప్రజల్లో కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తి..
- సీఎంగా మాత్రం సిద్ధరామయ్య వైపే జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది.
మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం, బీజేపీ పూర్తి మెజారిటీతో 136-159 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 51 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కి 40.3 శాతం (2023లో 42.88శాతం) ఓట్లతో 53-82 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. జేడీఎస్ 5 శాతం ఓట్లతో 3-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని సర్వే చెప్పింది. కర్ణాటకలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి, అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
Read Also: Perni Nani: అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్ కల్యాణ్‌పై పేర్నినాని ఫైర్..
బీజేపీ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో గత 20 ఏళ్ల నుంచి ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ మూడు సార్లు -2004, 2008, 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 113ని సాధించి ఎప్పుడూ అధికారాన్ని చేపట్టలేదు. ముఖ్యమంత్రిగా మాత్రం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య 29.2 శాతం ఓటర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత 10.7 శాతం ఓట్లతో డీకే శివకుమార్ రెండో ప్లేస్‌లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్. యడియూరప్ప (5.5 శాతం), బసవరాజ్ బొమ్మై (3.6 శాతం) మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర (5.2 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటక ప్రజలు ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ వైపే నిలిచారు. నరేంద్రమోడీకి 59 శాతం మంది సపోర్ట్ చేయగా, రాహుల్ గాంధీకి 17 శాతం, యోగి ఆదిత్యనాథ్‌కి 11 శాతం మంది ప్రతివాదులు మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!