Bengaluru: మొబైల్ ఫోన్ సౌండ్ తగ్గించాలని కోరినందుకు భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన మే 19న ఉత్తర బెంగళూర్‌లోని సిదేదహల్లిలోని ఎన్ఎంహెచ్ లేఅవుట్‌లో జరిగింది. మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడంపై భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైందని శనివారం పోలీసులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి తన భార్యపై టాయిలెట్ క్లీనర్ యాసిడ్ పోసినట్లు చెప్పారు. తల, ముఖంపై గాయాలైన 44 ఏళ్ల మహిళ ప్రస్తుతం ప్రమాదం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Read Also: Anusree Satyanarayana: పవన్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వృత్తి రీత్యా బ్యూటిషియన్ అయిన మహిళ రాత్రి 9 గంటలకు, తన భర్త మద్యం కొనుగోలు కోసం డబ్బులు అడిగినట్లు ఆరోపించింది. ఆమె నిరాకరించడంతో వేధించడం ప్రారంభించాడు, చివరకు డబ్బులు సంపాదించుకుని మద్యం కొనుగోలు చేశాడు. తాగి ఇంటికి వచ్చిన తర్వాత, మొబైల్ ఫోన్‌లో ఎక్కువ వాల్యూమ్‌తో పాటలు ప్లే చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ సౌండ్ తగ్గించాలని కోరినప్పుడు, అతను నిరాకరించాడు. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త బాత్‌రూం నుంచి టాయిలెట్ యాసిడ్ క్లీనర్ తీసుకువచ్చి, ఆమె తల, ముఖంపై పోశాడు.
దాడి తర్వాత ఆమె సాయం కోసం కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని పొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన భర్తను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.