Trump Tariffs: ఆపిల్‌కి మాత్రమే కాదు, శామ్‌సంగ్‌కి కూడా ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు..
- టారిఫ్స్ పేరిట ట్రంప్ బెదిరింపులు..
- ఇప్పటికే ఆపిల్‌కి 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక..
- శామ్‌సంగ్‌కి కూడా తప్పదని వార్నింగ్..
- ప్రొడక్షన్ అమెరికాకు మార్చాలని కోరుతున్న ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో బెదిరింపులు ఆపడం లేదు. ఇటీవల, ఆపిల్ అధినేత టిమ్ కుక్‌తో ట్రంప్ మిడిల్ఈస్ట్ పర్యటనలో భారత్‌లో ప్లాంట్ నెలకొల్పవద్దని, అమెరికాలో పెట్టాలని కోరారు. “అతను భారతదేశం అంతటా ఫ్లాంట్లు నిర్మిస్తున్నాడు. మీరు భారతదేశంలో ఫ్లాంట్లు నిర్మించడం నాకు ఇష్టం లేదు.” అని ట్రంప్ అన్నారు.
దీని తర్వాత, ఆపిల్ ఉత్పత్తిని అమెరికాకు మార్చకుంటే 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం వైట్ హౌస్‌లో ట్రంప్, ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ హెచ్చరికలు వచ్చినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
Read Also: Vijayawada: విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు.. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్ కాల్!
ఇదిలా ఉంటే, ఈ బెదిరింపు కేవలం ఆపిల్‌కి మాత్రమే కాదని, శామ్‌సంగ్‌కి కూడా వర్తిస్తాయని ట్రంప్ చెబుతున్నాడు. ఆపిల్‌తో సహా శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌తో సహా అందరు తయారీదారులను లక్ష్యంగా చేసుకుంటున్నానని, వారి పొడక్షన్స్‌ని అమెరికాకు తరలించడానికి ప్రోత్సహించానని ట్రంప్ చెప్పారు. ఇదే కాకుండా, దిగుమతి సుంకాలు సిద్ధంగా ఉన్నాయని, జూన్ చివరి నాటికి అమలు చేయబడుతాయని ట్రంప్ చెప్పాడు.
అంతకుముందు, మంగళవారం టిమ్ కుక్‌తో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ..‘‘ప్లాంట్లను నిర్మించడానికి భారతదేశానికి వెళ్తున్నానని ఆయన అన్నారు. భారతదేశానికి వెళ్లడం సరే, కానీ మీరు సుంకాలు లేకుండా ఇక్కడకు అమ్మబోరు అని నేను చెప్పాను’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఆపిల్, శామ్‌సంగ్ స్పందించడానికి నిరాకరించాయి.
చైనాలో తయారైన వస్తువులపై దిగుమతి సుంకాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి, ఆపిల్ భారత్‌లో పెద్ద ఎత్తున ఐఫోన్‌లు ఉత్పత్తి చేసి, అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ చర్య ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. అయితే, బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం, అమెరికాలో ఉత్పత్తి ఖర్చు, సుంకాలు చెల్లించడం కన్నా ఎక్కువ అవుతుంది.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!