కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Pad Mini Launch: ఒప్పో నుండి కొత్తగా చైనాలో జరిగిన లాంచ్ ఈవెంట్లో ఒప్పో ప్యాడ్ మినీ (OPPO Pad Mini)ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ టాబ్లెట్‌ను OPPO Find X9 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ చేశారు. కాంపాక్ట్ సైజ్, హైఎండ్ ఫీచర్లతో ఈ డివైస్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
స్లిమ్ డిజైన్, డిస్ప్లే:
ఒప్పో ప్యాడ్ మినీ చాలా తేలికగా, స్లిమ్‌గా ఉంటుంది. దీని బరువు కేవలం 279 గ్రాములు కాగా, మందం 5.39mm మాత్రమే. స్పేస్ గ్రే, మింట్ గ్రీన్, మోనెట్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ టాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.5K OLED డిస్ప్లేను అందించారు. 144Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. 2.99mm అల్ట్రా నారో బెజెల్స్‌తో స్క్రీన్-టు-బాడీ రేషియో కూడా ఆకట్టుకునేలా ఉంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
పవర్ఫుల్ ప్రాసెసర్, బ్యాటరీ:
OPPO ప్యాడ్ మినీలో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm టెక్నాలజీతో రూపొందించబడిన హైఎండ్ చిప్సెట్. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు. ఇందులో 8000mAh బ్యాటరీ ఉండగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లు:
ఈ టాబ్లెట్‌లో కనెక్టివిటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఒప్పో స్మార్ట్‌ఫోన్ దగ్గర ఉంటే ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ షేర్ అవుతుంది. డ్యూయల్ 5G నెట్వర్క్ షేరింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్, ఆపిల్ ఎకోసిస్టమ్‌ల మధ్య ఫైల్ ట్రాన్స్ఫర్, మెసేజ్ సింక్, ఒకేసారి పలువురు హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకునే అవకాశం కలదు.

స్టైలస్, యాక్సెసరీలు:
ఒప్పో AI స్టైలస్ సపోర్ట్ కూడా ఈ టాబ్లెట్‌లో ఉంది. రియలిస్టిక్ వైబ్రేషన్ ఫీడ్ బ్యాక్ తో పాటు AI డ్రాయింగ్, చార్ట్ క్రియేషన్, రింగ్‌టోన్ సెర్చ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్
కెమెరా, ఇతర ఫీచర్లు:
13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C సపోర్ట్ కలిగి ఉంది.
ధర, లభ్యత:
చైనాలో ఒప్పో ప్యాడ్ మినీ ధరలు ఇలా ఉన్నాయి:
* 8GB + 256GB – రూ. 50,700
* 12GB + 256GB – రూ.54,815
* 12GB + 512GB – రూ.61,670 నుంచి రూ.68,530 వరకు (వేరియంట్స్ ఆధారంగా)
ఈ టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 30 నుంచి చైనాలో సేల్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!