200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X9s Pro: ఒప్పో నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9s ప్రో (OPPO Find X9s Pro)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను OPPO Find X9 Ultra తో పాటు విడుదల చేశారు. హైఎండ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ప్రీమియం సెగ్మెంట్‌లో వచ్చింది.
డిజైన్, డిస్‌ప్లే:
OPPO Find X9s Pro స్లిమ్ డిజైన్‌తో 8.4mm మందంతో, 198 గ్రాముల బరువుతో వస్తుంది. ఒకే గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.32 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ చాలా స్మూత్ గా పనిచేస్తుంది. అల్ట్రా నారో బెజెల్స్ తో పాటు 1 నిట్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉండటం వల్ల కంటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. వీటితోపాటు అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా అందించారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
Hasselblad కెమెరా సిస్టమ్:
ఈ ఫోన్‌లో కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. Hasselblad భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఇందులో ఉంది. ఇందులో
* 200MP మెయిన్ కెమెరా (Samsung HPE సెన్సార్, OIS)
* 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (2.8x ఆప్టికల్ జూమ్)
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా
* 3.2MP మల్టీ స్పెక్ట్రల్ లెన్స్
* 32MP ఫ్రంట్ కెమెరా
ఈ కెమెరాలు సెటప్ 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Hasselblad మాస్టర్ మోడ్ తో ప్రత్యేక ఫోటో స్టైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పనితీరు, బ్యాటరీ:
OPPO Find X9s Proలో మీడియాటెక్ డిమెంసిటీ 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm టెక్నాలజీతో రూపొందించబడిన హైఎండ్ చిప్‌సెట్. భారీ యాప్స్, గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా నిర్వహించవచ్చు. ఈ ఫోన్‌లో 7025mAh భారీ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16తో ఫోన్ వస్తుంది.
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
ఇతర ఫీచర్లు:
స్టీరియో స్పీకర్లు, Wi-Fi 7, Bluetooth 6.1, 5G కనెక్టివిటీ, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ లు ఉన్నాయి.
ధర:
చైనాలో OPPO Find X9s Pro ధరలు ఇలా ఉన్నాయి.
12GB + 256GB – రూ. 72,670
12GB + 512GB – రూ. 78,155
16GB + 512GB – రూ. 82,270
16GB + 1TB – రూ. 95,980
ఈ ఫోన్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 24 నుంచి చైనాలో సేల్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!