Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Bloody Romeo Postponed: నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ‘బ్లడీ రోమియో’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పదే పదే ఆలస్యం అవుతుండటమే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది. ‘ది పారడైజ్’ చిత్రాన్ని ముందుగా 2026 సమ్మర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కాస్తా ఆగస్టు 21కి మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి కూడా సినిమా సిద్ధమవ్వడం కష్టమేనని టాక్.
Also Read :Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
నాని తన పూర్తి కాల్ షీట్స్ ‘ది పారడైజ్’కే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ దర్శకత్వంలో రావాల్సిన ‘బ్లడీ రోమియో’ పట్టాలెక్కడం మరింత ఆలస్యం కానుంది. నిజానికి ‘బ్లడీ రోమియో’ను 2026 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడమే గగనంగా మారింది. దీనివల్ల 2026 టార్గెట్ పూర్తిగా మిస్ అయ్యి, సినిమా 2027కి వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాని నుంచి ఒకే ఏడాది రెండు భారీ సినిమాలు చూడాలని ఆశపడ్డ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా నిరాశ కలిగించే విషయమే. అయితే సుజీత్ తన స్క్రిప్ట్‌పై మరికొంత వర్క్ చేసేందుకు ఈ సమయాన్ని వాడుకోనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!