Lioness kills 15-year-old boy in Gujarat: గుజరాత్ అమ్రేలి జిల్లాలో సింహాలు బాలుడిని చంపేశాయి. వావ్డీ గ్రామానికి చెందిన రాహుల్ మోస్వానియా అనే 15 ఏళ్ల బాలుడిపై సింహాలు దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రామ శివారులోని రహదారి గుండా నడుచుకుంటూ వస్తున్న సయమంలో బాలుడిపై సింహాలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రగాయాల పాలైన రాహుల్ చనిపోయాడు. మరణించిన బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తారు. సింహాలను బంధించేందుకు బోనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసియాటిక్ సింహాలకు దేశంలో ఏకైక నివాసంగా గుజరాత్ ఉంది. వాటి జనాభా పెరుగుతోంది. 2015లో 523 గా ఉన్న సింహాల సంఖ్య 29 శాతం పెరిగి 2020లో 674కు చేరింది.
Read Also: Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేయడంతో..
హోంవర్క్ చేయలేని కొడుకుకు నిప్పు:
పాకిస్తాన్ లో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని కన్న కొడుకుకు నిప్పు పెట్టాడు తండ్రి. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కొడుకు మరణించాడు. సెప్టెంబర్ 14న ఆరంగి టౌన్ లో నజీర్ అనే వ్యక్తి తన 12 ఏళ్ల కుమారుడు షాహీర్ పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో తండ్రిని అరెస్ట్ చేశారు. తీవ్రగాయాల పాలైన బాలుడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించాడు.
తన కొడుకును చంపే ఉద్ధేశ్యం తనకు లేదని.. పోలీస్ విచారణలో నజీర్ వెల్లడించారు. పాఠశాలలో హోంవర్క్ చేయడం లేదని భయపెట్టేందుకే కిరోసిన్ పోసి నిప్పంటించానని తెలిపాడు. కొడుకును భయపెట్టేందుకు అగ్గిపెట్టె వెలిగించానని.. అయితే అది అంటుకోవడంతో షాహీర్ తీవ్రంగా కాలిపోయాడని అతను చెప్పాడు.