భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- Motorola Edge 70 Pro భారత్‌లో అధికారికంగా లాంచ్
- 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
- MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్
- ట్రిపుల్ కెమెరా సెటప్
- 6500mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 3 సంవత్సరాల OS అప్డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 70 Pro Launched: మోటరోలా (Motorola) తన ఎడ్జ్ సిరీస్ లో భాగంగా కొత్త స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro)ను భారత్‌లో అధికారికంగా నేడు లాంచ్ చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ ఫోన్ హైఎండ్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్స్‌గా నిలుస్తున్నాయి.
డిస్‌ప్లే, డిజైన్:
మోటోరోలా ఎడ్జ్ 70 Proలో 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 10-bit కలర్ సపోర్ట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో పాటు IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో కేవలం 6.99mm మందంతో వస్తుంది. మెటల్ ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో ఎక్కువ రోజుల ఉపయోగానికి అనుకూలంగా రూపొందించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డిమెంసిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4nm టెక్నాలజీతో రూపొందించిన ఈ చిప్‌సెట్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మంచి పనితీరును అందిస్తుంది. అలాగే మొబైల్ లో 4600mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించినా హీట్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో 12GB వరకు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంది.

కెమెరా ఫీచర్లు:
Motorola Edge 70 Proలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఈ సెటప్ లో 50MP Sony LYTIA-710 మెయిన్ కెమెరా (OISతో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా (మాక్రో సపోర్ట్‌తో), మల్టీస్పెక్ట్రల్ సెన్సర్, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. అన్ని కెమెరాలతో 4K @ 60fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో 6500mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. స్లిమ్ బాడీ ఉన్నప్పటికీ పెద్ద బ్యాటరీ అందించడం ఓ ప్రత్యేకత.
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
సాఫ్ట్‌వేర్, ఇతర ఫీచర్లు:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఇది 3 సంవత్సరాల OS అప్డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇక ఇందులో స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర:
* 8GB + 256GB వేరియంట్ రూ. 38,999
* 12GB + 256GB వేరియంట్ రూ. 41,999
ఈ ఫోన్ పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టీ, పాంటోన్ టైటాన్ కలర్స్‌లో లభిస్తుంది. ఏప్రిల్ 29 నుంచి ఫ్లిప్కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ల కింద HDFC, ICICI బ్యాంక్ కార్డులతో రూ. 2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లేదా రూ. 2000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!