Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
- నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
- హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..
- చిక్కుల్లో ప్రధాని బాలెన్ షా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan Gurung: అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే నేపాల్‌లోని బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ హోంమంత్రి సుదన్ గురుంగ్ తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య ఆయన బుధవారం తన పదవికీ రాజీనామా చేస్తూ.. ఆ రాజీనామా పత్రాన్ని ప్రధాని బాలెన్ షాకు సమర్పించారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
రాజీనామాకు దారితీసిన కారణాలు ఇవే..
హోంమంత్రి సుదన్ గురుంగ్‌పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు, మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న దీపక్ భట్టా వంటి వివాదాస్పద వ్యాపారవేత్తల కంపెనీల్లో వాటాలు (షేర్లు) కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడటం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణకు సహకరించేందుకే తాను నైతిక బాధ్యతతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గురుంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అప్పుడే రోడ్లపైకి వస్తున్న జనం..
ప్రధాని బాలెన్ షా పగ్గాలు చేపట్టి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాట్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ ప్రజల్లో అసంతృప్తికి ప్రధాన కారణం భారత్‌తో ముడిపడి ఉన్న సరిహద్దు నిబంధనలు అని విశ్లేషకులకు చెబుతున్నారు. భారత్ నుంచి వచ్చే వంద రూపాయల (నేపాలీ రూ.100) కంటే ఎక్కువ విలువైన వస్తువులపై నేపాల్ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని విధిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం భారత్‌పై ఆధారపడతారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో జనం ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన బాలెన్ షాకు, తన కేబినెట్ మంత్రే అవినీతి ఆరోపణలతో తప్పుకోవడం పెద్ద దెబ్బ. అటు సొంత పార్టీలో అసమ్మతి, ఇటు ప్రజల నిరసనల మధ్య బాలెన్ షా ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?