France and USA praised Prime Minister Modi’s comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ చెప్పిన మాట సరైనదని ఆయన అన్నారు. ఇది పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాని.. ఇది సార్వభౌమాధికారానికి సమిష్టి సమయం అని ఆయన అన్నారు.
Read Also: Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
మరోవైపు యూఎస్ఏ కూడా మోదీ వ్యాఖ్యలను ప్రశంసిస్తోంది. ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ పత్రికలు ప్రధాని మోదీ వ్యాఖ్యలను పొడుగుతూ కథనాలను ప్రచురించాయి. తాజాగా ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పంపిన సందేశాన్ని అమెరికా స్వాగతించిందని..అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) జేక్ సుల్లివన్ మంగళవారం తెలిపారు. వైట్ హౌజ్ లో మాట్లాడిన ఆయన మోదీ చెప్పింది సరైనదే అని అన్నారు. రష్యాతో సుదీర్ఘ సంబంధాలు కలిగి ఉన్న భారత్.. యుద్ధం ముగిసే సమయమని చెప్పడాన్ని అభినందించారు. యూఏన్ఏ చార్టర్ ప్రాథమిక నిబంధనలకు రష్యా కట్టుబడి ఉండటం.. బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇవ్వడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని సలహా ఇచ్చారు.
ఇటీవల షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్ వెళ్లారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ప్రస్తుతం యుగం యుద్ధాలది కాదని ప్రధాని మోదీ పుతిన్ తో అన్నారు. ఈ విషయం గురించి గతంలోనే మీతో ఫోన్లో మాట్లాడానని.. అన్నారు. మీ వైఖరి గురించి తెలుసని.. యుద్ధాన్ని త్వరలోనే ముగించాలని అనుకుంటున్నామని పుతిన్, మోదీకి వెల్లడించారు. ఇద్దరి మధ్య ఆహార భద్రత, ఇంధన సంక్షోభం వంటి వాటిపై చర్చ జరిగింది. ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి సహకరించినందుకు మోదీ, పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు.