మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. […]
తొలిసారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అవకాశం దక్కడం గొప్ప విషయం అని.. ద్రౌపతి ముర్ము గెలవడం ఖాయమని అన్నారు ఎంపీ జీవీఎల్ నర్సింహరావు. ముర్ము అభ్యర్థిత్వంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఇతర పార్టీలు పార్టీలు కూడా ద్రౌపతి ముర్ముకే మద్దతు పలికే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. దేశంలో జూలై 1 నుంచి ముర్ము ప్రచారం మొదలుపెడుతారని.. ఇప్పటికే పలువురు నాయకుల మద్దతు కోరారని.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు […]
కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ. ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి […]
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, ప్రావిడెంట్ ఫండ్, వీక్లీ ఆఫ్స్ ఇలా అన్నింటిపై ప్రభావం పడనుంది. కొత్త లేబర్ చట్టాల ప్రకారం.. రోజూవారీ పని గంటలు పెరగడంతో పాటు ఉద్యోగుల హోం టేకింగ్ సాలరీ తగ్గి, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాల కింద నిబంధనలను రూపొందించ […]
నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా రిటైర్డ్ ఐఏఎస్ పరమేశ్వరన్ అయ్యర్ నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. భారత ప్రభుత్వ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయ్యర్ ను క్యాబినెట్ నియామకాల కమిటీ నియమించింది. జూన్ 30, 2022 వరకు అమితాబ్ కాంత్ పదవీ కాలం ఉంది. ఆ తరువాత అయ్యర్ […]
సాధారణంగా ప్రభుత్వ పథకాల పనులంటేనే నాసిరకంగా ఉంటాయనేది ప్రజల నమ్మకం. కాంట్రాక్టర్లు తమ కక్కుర్తితో భవనాలను, రోడ్లను నాసిరకంగా నిర్మిస్తుంటారు. అయితే చేయి వేస్తే కూలిపోయేంత నాసిరకంగా మాత్రం భవనాలు నిర్మించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అది కూడా అలాంటి ఇలాంటి భవనం కాదు.. రూ.100 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్ భవనం. నాణ్యత పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే చేయి వేయగానే భవనం గోడలు […]
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో నిందితుడికి మరణ శిక్షను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సమర్థించింది. అత్యంత దారుణంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు పాశవికంగా హత్య చేయడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం క్రూరమైనదని..అమానవీయమని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వికలాంగురాలైన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మనోజ్ ప్రతాప్ సింగ్ కు రాజస్థాన్ హైకోర్ట్ విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. న్యాయమూర్తులు […]
భారత అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శుక్రవారం రోజు ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ‘‘వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం’’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ( వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం) క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది. ఇండియన్ నేవీతో కలిసి ఈ రోజు పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ క్షిపణిని యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు. ఆకాశం నుంచి వచ్చే శత్రు […]
మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చారు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి 39 మంది ఎమ్మెల్యేలు చేరారు. దాదాపుగా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే క్యాంపులో 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఉద్ధవ్ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏక్ నాథ్ షిండే సిద్ధమవుతున్నట్లు సమాచారం. […]
మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతున్నారు. శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు శివసేన పార్టీలో చీలిక తెచ్చారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే ఏక్ నాథ్ షిండే మాత్రం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ, […]