టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదుల మేరకు కీలకమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులపై సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్స్ మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ అరోరా స్పష్టం చేశారు.
Also Read :Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఆయన పేరు, ప్రతిష్ట, చిత్రాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ అరోరా ఈ కేసును విచారించి, తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఆ రోజున ఈ అంశంపై మరింత సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ తీర్పుతో, తమ వ్యక్తిగత హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు చట్టపరంగా రక్షణ పొందడానికి సినీ ప్రముఖులకు ఇది ఒక కీలకమైన పరిణామంగా మారింది. గతంలో ఇదే రకమైన కేసులు హీరోలు నాగార్జున, చిరంజీవి సైతం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.