తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా […]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దాదాపుగా ముగిసిపోయింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరోవైపు రెండు పార్టీల సంక్షీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఇరు పార్టీల మధ్య కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను సమావేశం అయ్యారు సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అంతకుముందు రాష్ట్రపతి రామ్ నాథ్ […]
తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. వరస చేరికలతో హుషారుగా కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వరసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్ […]
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా […]
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు […]
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి. తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు […]
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి. […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై యూఏస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా స్నేహితుడు, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో కాల్చి చంపారనే వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యానని.. బాధపడ్డానని..ఈ విషాదకర సమయంలో అమెరికా జపాన్‌కు అండగా నిలుస్తుందని జో బైడెన్ అన్నారు. ఆయన మరణం జపాన్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని ఆయన అన్నారు. అబేతో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించిందని బైడెన్ అన్నారు. […]
మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం […]