Rishi Sunak: యూకే పీఎం రేసు నిలబడుతున్నట్లు స్పష్టం చేసిన రిషి సునక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ‘‘ ఈ క్షణంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.. అందుకే నేను కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా.. మీ ప్రధానమంత్రిగా పోటీలో నిలబడుతాను’’ అని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రధాని బోరిస్ జాన్సన్, 42 ఏళ్ల రిషి సునక్ ని ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన క్యాబినెట్ హోదా పొందారు. కరోనా సమయంలో కార్మికులు, వ్యాపారుల కోసం 10 మిలియన్ల పౌండ్ల భారీ ప్యాకేజీ ప్రకటించి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రిషి తాతముత్తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Read Also: K Laxman: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
ప్రధాని పదవి కోసం ప్రచారాన్ని మొదలుపెట్టిన రిషి సునక్ తన అమ్మమ్మ బ్రిటన్ కు వచ్చని కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఎన్నో ఆశలతో మెరుగైన జీవితం కోసం తన అమ్మమ్మ బ్రిటన్ కు వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం యూకే అనేక ఛాలెంజెస్ ను ఎదుర్కొంటోందని.. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను బలపరచాలని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయితే ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు.
I’m standing to be the next leader of the Conservative Party and your Prime Minister.
Let’s restore trust, rebuild the economy and reunite the country. #Ready4Rishi
Sign up 👉 https://t.co/KKucZTV7N1 pic.twitter.com/LldqjLRSgF
— Rishi Sunak (@RishiSunak) July 8, 2022
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!