రష్యా, ఉక్రెయిన్ వార్, నాటో- రష్యాల మధ్య ఘర్షణ, చైనా-తైవాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచంలో న్యూక్లియర్ వార్ భయాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధ సమయంలో రష్యా నాయకులు అణుయుద్ధం పేరుతో బెదిరింపులకు దిగారు. తమపై నాటో దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణు యుద్ధం జరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మల్లీపుల్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ సహకారంతో అధ్యయనం చేశారు. అణు […]
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా పిలిచే ఈ వేరియంట్ భారత్ తో పాటు 10 దేశాల్లో కూడా గుర్తించారు. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా […]
అవినీతి ఆరోపణలపై సీబీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిని అరెస్ట్ చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసింది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ లో నిందితులకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సీబీఐ. రూ. 93 లక్షలతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్ర పన్నుతూ.. ప్రైవేట్ కంపెనీకి టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. […]
ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యూపీలో రూ.1800 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి వారణాసిలో పర్యటించారు. వారణాసిలో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో ప్రసంగిస్తూ మోదీ కొత్త జాతీయ విద్యా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక లక్ష్యం విద్యను సంకుచిత ఆలోచన ప్రక్రియ పరిమితుల నుంచి బయటకు తీసుకురావడమే అని ఆయన అన్నారు. 21వ […]
మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు. […]
ప్రపంచ వ్యాప్తంగా గోధుమ సంక్షోభం నెలకొంది. దీంతో దేశీయంగా గోధుమలను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఇండియా మే లో గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. అయితే తాజాగా గోధుమ పిండి ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల కారణంగా ప్రపంచ కొరత వల్ల మే నెలలో జాతీయంగా ఆహార ధాన్యాల నిల్వలు పెంచడానికి గోధుమ ధాన్యాల ఎగుమతులు భారీగా తగ్గించబడ్డాయి. విదేశీ వాణిజ్య నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్( డీజీఎఫ్టీ) […]
మహారాష్ట్ర, కర్ణాటకలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలో వర్షాలపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ReadAlso: YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ […]
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో […]
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. చంఢీగఢ్ లోని సెక్టార్ 2లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సన్నిహితులు, బంధువులతో పాటు ఆప్ జాతీయ కన్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత రాఘవ్ చద్ధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన డాక్టరైన గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు […]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి వర్గం నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేశారు. క్యాబినెట్ లో కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ తో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వరకు మొత్తం ఆరుగులు మంత్రులు రాజీనామా చేసి బోరిస్ జాన్సన్ పై ఒత్తడి పెంచారు. ఇదిలా ఉంటే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలోని 54 […]