జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై యూఏస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా స్నేహితుడు, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో కాల్చి చంపారనే వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యానని.. బాధపడ్డానని..ఈ విషాదకర సమయంలో అమెరికా జపాన్‌కు అండగా నిలుస్తుందని జో బైడెన్ అన్నారు. ఆయన మరణం జపాన్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని ఆయన అన్నారు. అబేతో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించిందని బైడెన్ అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహం, ద్వైపాక్షిక సంబంధాలకు షింజో అబే కృషి చేశారని అన్నారు. ఇండో-పసిఫిక్ రిజియన్ భద్రతపై కీలకంగా పనిచేశారని జోబైడెన్ అన్నారు. జపాన్ ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింసాత్మక దాడులు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని జో బైడెన్ అన్నారు.
Read Also: Sunil Gavaskar: పంత్ ఓపెనర్‌గా వస్తే.. విధ్వంసమే!
షింజో అబే మరణంపై కాంగ్రెస్ తాత్కిలిక అధ్యక్షరాలు సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా భారత్ కు అబే గొప్ప స్నేహితుడని కొనియాడారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని విస్తరించడానికి, పెంచడానికి పాటుపడ్డారని ఆమె అన్నారు. ఇది జపాప్ కే కాదు అంతర్జాతీయ సమాజానికి సంభవించిన దురదృష్టం సంఘటనల అని అన్నారు.
US President Joe Biden, while expressing his condolences on the demise of #ShinzoAbe said, "I'm stunned, outraged & deeply saddened by the news that my friend Abe Shinzo, former PM of Japan, was shot and killed while campaigning… US stands with Japan in this moment of grief." pic.twitter.com/RSGPBNzdsO
— ANI (@ANI) July 8, 2022