మహారాష్ట్రలో కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకున్న తరహాలోనే తన కాన్వాయ్ కి ప్రత్యేక ప్రోటోకాల్ అవసరం లేదని ఆయన రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. వీఐపీల కన్నా సమాన్యుడికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తన కాన్వాయ్ కోసం బందోబస్లు అవసరం లేదని మహారాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ రజీనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తో చర్చించిన తర్వాత సీఎం ఏక్ నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కు ఎలాంటి పోలీస్ బందోబస్త్ ఉండకూడని.. ఇది సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడంలో జాప్యం చేస్తుందని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Gurpreet Kaur: పెళ్లయిన తర్వాత రోజే సీఎం భార్య ట్విట్టర్ ఖాతా బ్లాక్.. ఎందుకంటే..
ఇది సామాన్యుల ప్రభుత్వం కాబట్టి వారికి వీఐపీల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. షిండే అన్నారు. ప్రత్యేక ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని.. ప్రజల దినచర్యకు అంతరాయం కలుగుతుందని.. ఇది పోలీసులపై భారం పడేలా చేస్తుందని ఆయన అన్నారు. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహకారంలో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం పదవిని అధిష్టించారు. తాజాగా థానే, నవీ ముంబై, కళ్యాణ్ డోంబివాలి నగరాల కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండేకు వర్గానికి మద్దతు తెలిపారు. 122 మంది కార్పొరేటర్లు ఉన్న కళ్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ లో 84 మంది శివసేన కార్పొరేటర్లు ఉంటే 40 మంది,111 మంది ఉన్న నవీ ముంబై కార్పొరేషన్ లో 38 మంది శివసేన కార్పొరేటర్లలో 32 మంది షిండేకు మద్దతు తెలిపారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ లో 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది షిండే వర్గానికి మద్దతు తెలిపారు.