వంట నూనెల ధరలు మరింతగా తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంట నూనెల ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశీయంగా వంట నూనెల గరిష్ట రిటైల్ ధర( ఎంఆర్పీ)ని లీటర్ కు రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ లను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై ఆదేశించింది. శుక్రవారం రోజున తయారీదారులు, రిఫైనలరీలకు, పంపిణీదారులు తగ్గించిన ధరను వెంటనే అమలు చేయాలని […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రపంచ దేశాలు సంతాపాన్ని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయనపై మాజీ సైనికులు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మరణించాడు. ఈ ఘటన రాజధాని టోక్యోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారా నగరంలో చోటు చేసుకుంది. అయితే షింజో అబేను బతికించేందుకు డాక్టర్లు ఐదు గంటల పాటు శ్రమించినా కాపాడలేకపోయారు. జపనీస్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు షింజో అబే ఎన్నికల ప్రచారంలో […]
బాధ్యతాయుతంగా ఉండీ సమాజానికి మంచి విలువలు అందించాల్సిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి పాడుపనికి పాల్పడ్డాడు. ఐఐటీ ట్రైనీ స్టూడెంట్ ను లైంగికంగా వేధించాడు. దీంతో ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. సదరు ఐఏఎస్ అధికారి సయ్యద్ రియాజ్ అహ్మద్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కుంతి సబ్ డిజిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా విధులు నిర్వహిస్తున్న అహ్మద్ ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు […]
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం చంఢీగర్‌లోని సీఎం నివాసంలో డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను వివాహం చేసున్నాడు మాన్. హర్యాన కురుక్షేత్రకు చెందిన గుర్ ప్రీత్ కౌర్, సీఎం భార్య కావడంతో ఒక్కసారిగా నెటిజెన్లు ఈమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ అయిన గుర్ ప్రీత్ కౌర్, గత ఎన్నికల్లో భగవంత్ మాన్ కు సహకరించిందని తెలుస్తోంది. భగవంత్ మాన్ కుటుంబానికి, గుర్ ప్రతీ కౌర్ కుటుంబానికి సన్నిహిత […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షింజో అబేకు నివాళిగా భారత్ రేపు(జూలై 9) ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం పాటించాలని ప్రధాని మోదీ […]
డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది. తూర్పు లడఖ్ సెక్టార్ లో ఘర్షణ ప్రాంతం సమీపంలోకి చైనా యుద్ధవిమానం వచ్చింది. ఈ ఘటన గత నెల చివరి వారంలో జరిగింది. జూన్ చివరి వారంలో ఒక రోజు సాయంత్రం 4 గంటలకు చైనా యుద్ధవిమానం వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా భారత భూభాగానికి దగ్గర వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన భారత సైన్యం వెంటనే […]
ప్రముఖ రాజకీయ నాయకుడు, బాలీవుడ్ యాక్టర్ రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది యూపీ లక్నో కోర్టు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అతనిపై దాడి చేసిన కేసులో తాజాగా లక్నో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మే 1996లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారిపై రాజ్ బబ్బర్ దాడి చేశాడు. ఈ ఘటనపై యూపీలోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1996 ఎన్నికల సమయంలో […]
యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా […]
భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం […]
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన పొడవైన క్యూలే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి ప్రజలు చూస్తున్నా.. నిత్యావసరాలు దొరకడం లేదు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, డిజిల్ స్టేషన్ల వల్ల పెద్ద ఎత్తున వాహనాలు, ప్రజలు దర్శనమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభం మధ్య ఉండలేమనుకున్న ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందేందుకు పాస్‌పోర్ట్ కోసం ప్రజలు దరఖాస్తు చేస్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా […]