Venu Goapl Reddy
Author- NTV Telugu-
MyGate Lays Off: లేఆఫ్ జాబితాలోకి మరో కంపెనీ.. 30 శాతం ఉద్యోగులకు ఉద్వాసన
MyGate Lays Off: ఐటీ సెక్టార్ లో లేఆఫ్ పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రారంభం అయిన ఐటీ ఉద్యోగుల తొలగింపు ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థికమాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాల్లో… -
Medical Miracle: హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి.. ప్రపంచంలో మూడో వ్యక్తిగా రికార్డ్..
Medical Miracle: హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు రోగులు ఇలాగే కోలుకున్నారు. తాజాగా ఫ్రాన్స్… -
Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..
Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు. -
Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. 6.4 తీవ్రతతో కంపించిన భూమి..
Turkey Earthquake: భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. -
Elon Musk: ప్రపంచాన్ని ఇంటర్నెట్ ఏలుతుంది.. 25 ఏళ్ల క్రితమే మస్క్ అంచనా.. పాత వీడియో వైరల్..
Elon Musk Old video Goes Viral: ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్ తో పాటు ఇటీవల ట్విట్టర్ ను కూడా సొంతం చేసుకున్నారు. తను ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అవ్వాల్సిందే. అంతలా వ్యాపార సామ్రాజ్యంలో మస్క్ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ దాదాపుగా 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ గురించి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుందని ఆయన అన్నారు. సరిగ్గా… -
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..
Arunachal Pradesh Earthquake: ప్రపంచంలో ఇటీవల కాలంలో వరసగా భూకంపాలు నమోదు అవుతున్నాయి. టర్కీ భూకంప విషాదం ముగియకముందే పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో ఆదివారం భూకంపం వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు అస్సాం, భూటాన్ దేశం తూర్పు ప్రాంతాల వరకు ప్రకంపనలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12.12 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు నేషనల్… -
Ravi Shankar Prasad: మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారు.. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడు..
Ravi Shankar Prasad: ప్రతిపక్షాల ఐక్యతను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కూడా విపక్ష కూటమిలో చేరాలని, ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు నితీష్ కుమార్ పై విరుచుకు పడుతున్నారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని.. ప్రధాని కావాలనే నితీష్ కల ఎప్పటికీ ఫలించదని అన్నారు. -
Bihar: భయపడి సెల్‌ఫోన్ మింగేసిన ఖైదీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Bihar jail inmate swallows mobile phone: బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మింగేశారు. జైలులో పోలీస్ అధికారులు తనిఖీ చేస్తుండటంతో, తన దగ్గర ఉన్న ఫోన్ దొరుకుతుందనే భయంతో మింగేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొంత సేపటికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఖైదీని ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ..
Virat Kohli Breaks Sachin Tendulkar's All-Time Record: స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒక్కొక్కటిగా ప్రపంచ రికార్డులను తుడిచిపెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రికెట్ లోనే అత్యధిక సెంచరీల రికార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. తాజాగా మరో రికార్డును విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచారు విరాట్ కోహ్లీ. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజాగా సచిన్ రికార్డును బద్దలు… -
NASA: విచిత్ర ఆకారంలో గ్రహశకలం.. 2040లో భూమికి అత్యంత సమీపంలోకి..
NASA: సౌరకుటుంబంలో అనేక గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. చాలా వరకు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం వీటి నుంచి బయటపడి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. అయితే తాజాగా కనుగొన్న గ్రహశకలం మాత్రం విచిత్రమైన ఆకారంలో ఉంది. ఓ పెద్ద భవనం మాదిరిగా ఉంది. దీని పొడవు 1600 అడుగులు కాగా.. వెడల్పు 500 అడుగులు ఉన్నట్లు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పోలుస్తున్నారు శాస్త్రవేత్తలు.
తాజావార్తలు
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..