Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి.. వరదల్లో చిక్కుకుని 10 మంది మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో యాత్రికులు వేసిన టెంట్లు కూడా కొట్టుకుపోయాయి.బోలేనాథ్ గుహ వద్ద వరదల్లో దాదాపుగా 12 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దీంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పాటు లోయల్లో యాత్రికులు వేసుకున్న టెంట్లన్ని కొట్టుకుపోయాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకువచ్చేలా రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
Read Also: Chandrababu: మొన్న చెల్లి వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వెళ్లిపోయింది..!
గత నెల 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయింది. ఆగస్టు 11 వరకు ఈ యాత్ర జరగనుంది. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వచ్చారు. అయితే నిన్నటి నుంచి అమర్ నాథ్ పరిసరాల్లో భారీగా వర్షం పడుతుండటంతో పాటు కొండలపై నుంచి మెరుపు వరదలు పరిసరాలను ముంచెత్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వాతావరణం రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.
ప్రధాని మోదీ అమర్ నాథ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో మాట్లాడానని.. సహాయక చర్యలు కొనసాగుతాయని ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?