నందమూరి అభిమానులే కాదు, యావత్ భారత సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అఖండ తాండవం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నిజానికి, ఈ సినిమా షెడ్యూల్ చేయబడిన ప్రకారం అయితే డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించబడాల్సి ఉంది. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిన అనంతరం డిసెంబర్ 12 సహా, 25 లేదా సంక్రాంతి అంటూ రకరకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. అయితే, ఈరోజు మధ్యాహ్నం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో 14 రీల్స్ ప్లస్ సంస్థ తాము ఇంటర్నల్ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
Also Read: Akhanda 2 : అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!
ఈ నేపథ్యంలో కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీంతో, అఖండ తాండవం సినిమా రిలీజ్‌కి గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది.
ఎక్కువ లేట్ చేయకుండా సినిమాని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఒకరోజు ముందు, అంటే డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ప్రస్తుతానికి ప్రీమియర్స్ విషయాన్ని వెల్లడించలేదు కానీ, సినిమా రిలీజ్ అయితే డిసెంబర్ 12వ తేదీ ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేయడమే కాదు, కొత్త రిలీజ్ డేట్ పోస్టర్స్ సైతం రిలీజ్ చేసింది. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంటతో కలిసి గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.