ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును ఇండియాలోని ఓ వ్యక్తిలో గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తితో ఈఎంఎం నెగటివ్ బ్లడ్ గ్రూపును గుర్తించారు. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ప్రపంచంలో ఇప్పటి వరకు 10 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు. తాజాగా తొలిసారిగా ఇండియాలో గుర్తించారు. సాధారనంగా మనకు ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉంటాయి. మొత్తం మానవశరీరంలో 42 రకాల బ్లడ్ సిస్టమ్స్ ఉంటాయి. అయితే ఈఎంఎంలో ఎక్కువగా 375 యాంటిజెన్లు ఉంటాయి. దీంతోనే ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపుగా ఉంది.
ఈఎంఎం నెటిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎవరికి రక్తాన్ని దానం చేయలేరు, ఇతరల నుంచి తీసుకోలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మందిలో మాత్రమే ఈ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును గుర్తించారు. ఇటీవల వైద్యం కోసం వచ్చిన సమయంలో బ్లడ్ టెస్టులు చేస్తున్న క్రమంలో ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు.
Read Also: Reporter Stuck in Flood Car Found: కొనసాతున్న రెస్క్యూ అపరేషన్.. కారు గుర్తింపు
గుండెపోటుతో ఓ 65 ఏళ్ల వ్యక్తి అహ్మదాబాద్ లో ఓ ఆస్పత్రిలో చేరాడు. అయితే ఈ క్రమంలో ఆయనకు శస్త్రచికిత్స చేసేందుకు బ్లడ్ అవసరం కావాల్సి వచ్చింది. వెంటనే అతని బ్లడ్ ను పరీక్షలకు పంపించారు. అయితే అహ్మదాబాద్ లోని ప్రథమ్ లాబోరేటరీ ఆయన బ్లడ్ గ్రూపు ఏంటో కనుక్కోలేకపోయింది. ఈ బ్లడ్ శాంపిళ్లను సూరత్ లోని రక్తదాన కేంద్రానికి పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడ కూడా బ్లడ్ ఏ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ కాలేదు. దీంతో సదరు వ్యక్తి బ్లడ్ గ్రూపుతో పాటు అతని కుటుంబ సభ్యుల రక్త నమూనాలను అమెరికా పంపించారు. అక్కడ ఈ బ్లడ్ గ్రూప్ ఈఎంఎం నెగిటివ్ బ్లడ్ గ్రూపుగా తేలింది. రక్తంలో ఈఎంఎం లేకపోవడం వల్ల, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్బీటీ) దీనికి ఈఎంఎం నెగిటివ్ పేరు పెట్టింది.