అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది.
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాగ్రేజ్ పాయింట్ (ఎల్2) లో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఎన్నో అద్బుత చిత్రాలను భూమికి పంపిస్తోంది. తాజాగా విశ్వంలో డీప్ ఇమేజెస్ ను తీసింది. అనేక గెలాక్సీల సముదాయాన్ని జెమ్స్ వెబ్ తీసింది దీన్ని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ విడుదల చేశారు. తాజాగా భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి లాంటి ఓ నక్షత్రం చుట్టూ తిరుగున్న డబ్ల్యూఏఎస్పీ 96-బీ అనే గ్రహంపై నీటి ఆనవాళ్లు, మేఘాలను గుర్తించింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. సౌరకుటుంబంలోని గురు గ్రహం ద్రవ్యరాశిలో సగం ఉండీ.. గురుడి వ్యాసం కన్నా 1.2 రెట్లు పెద్దదిగా ఉన్న గ్యాస్ జెయింట్ పై నీటి ఆనవాళ్లను గుర్తించింది.
Read Also: Heavy Rainfall: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
సదరన్ రింగ్ ప్లానెటరీ నెబ్యులాలో చనిపోతున్న నక్షత్రం సూపర్ నోవా చిత్రాన్ని తీసింది. భారీ షాక్ వేవ్, టైడల్ టెయిల్ చూపించే గెలాక్సీ క్లస్టర్లను నమోదు చేసింది. దాదాపుగా 9 బిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ మిషన్ విశ్వం పుట్టుకకు సంబంధించిన ఆనవాళ్లు వెల్లడించనుంది. బిగ్ బ్యాంగ్ తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను చూసే వీలుంది. నక్షత్రాలు ఏర్పడటం, బ్లాక్ హోల్స్ కు సంబంధించిన అనేక విషయాలను మరింతగా తెలుసుకునే వీలు కలిగింది. నాసా, యూరోపియన్, కెనడియన్ స్పెస్ ఎజెన్సీలు 2021లో డిసెంబర్ లో విశ్వంలోకి పంపారు.
Some stars go out with a bang. In these images of the Southern Ring planetary nebula, @NASAWebb shows a dying star cloaked by dust and layers of light. Explore this star's final performance at https://t.co/63zxpNDi4I #UnfoldTheUniverse. pic.twitter.com/dfzrpvrewQ
— NASA (@NASA) July 12, 2022
Take Five: Captured in exquisite detail, @NASAWebb peered through the thick dust of Stephan’s Quintet, a galaxy cluster showing huge shockwaves and tidal tails. This is a front-row seat to galactic evolution: https://t.co/63zxpNDi4I #UnfoldTheUniverse pic.twitter.com/em9wSJPkEU
— NASA (@NASA) July 12, 2022