Rishi Sunak: యూకే ప్రధాని రేసులో రిషి దూకుడు.. మొదటి రౌండ్లో అత్యధిక ఓట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే యూకేకు ప్రధాని పీఠం రిషి సునక్ ను వరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.
యూకేలో జరిగిన రాజకీయ సంక్షోభంలో ముందుగా రాజీనామా చేసిన వ్యక్తుల్లో ఛాన్సలర్ గా ఉన్న రిషి సునక్ ఒకరు. ఆయన రాజీనామా తర్వాతే ఒక్కక్కరిగా కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకోవడంతో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 లోపు బోరిస్ జాన్సన్ వారసున్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
Read Also: Godavari River: గోదావరి మహోగ్ర రూపం.. కాటన్ బ్యారేజ్ వద్ద పరిస్థితి ఇది..!
ఇదిలా ఉంటే ప్రధాని రేసులో రిషి సునక్ దూసుకుపోతున్నారు. తాజాగా ప్రధాని పదవి కోసం జరిగిన తొలి రౌండ్లో సత్తా కనబరిచారు. అందరి కన్నా ఎక్కువగా ఎంపీల ఓట్లు సాధించారు. రిషి సునక్ కు మొత్తం 88 ఓట్లు సాధించగా.. పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లు, ట్రస్ లిజ్ 50 ఓట్లు సాధించారు. మొత్తం ఎనిమిది మందిలో ప్రస్తుతం ఆరుగులు రెండో రౌండ్ లోకి వెళ్లనున్నారు. రిషి సునక్ తో పాటు సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా రెండో రౌండ్ కు అర్హత సాధించారు. ఆర్థిక మంత్రి నదీమ్ జహావి, మాజీ క్యాబినెట్ మంత్రి జెరెమీ హంట్ పోటీ నుంచి తొలగించబడ్డారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!