ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలు, జనాభా పెరుగుదల వచ్చే సమస్యలు, పర్యావరణంపై ప్రభావం ఇలా ప్రతీ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో భూమి మీద జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా జనాభా దినోత్సవాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతం భూమిపై అన్ని దేశాల్లో కలిపి […]
తెలంగాణకు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని లెక్కకట్టింది. చాలా ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా […]
రెండు రోజుల విరామం తరువాత అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయింది. ఇటీవల జరిగిన వరదల కారణంగా 16 మంది చనిపోవడంతో పాటు 40 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు సహాయ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు అమర్ నాథ్ యాత్రకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మంచు శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు సమాయత్తం అయ్యారు. ఈ రోజు బేస్ క్యాంపు నుంచి 12వ బ్యాచ్ అమర్ నాథ్ యాత్రకు […]
సీఎం కేసీఆర్ పై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీ ప్రభుత్వం, నీ విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. మేము కూడా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు సవాల్ విసిరారు లక్ష్మణ్. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఠాయికి మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీ సీఎం యోగి గురించి మాట్లాడారని.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తు చేశారు. యోగీ వేసుకున్న బట్టల గురించి లుంగీ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పెత్తనం లేకుండా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం జీవిస్తున్నారని.. కానీ మీరు మీ కుటుంబం వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం, అహంకారం కోసం పాలిస్తున్నారని విమర్శించారు. […]
మరో హృదయవిదారక ఘటన. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. రెండేళ్ల తన సోదరుడి శవాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన, మురికి పరిసరాల్లో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడి ఘటన దేశ వ్యాప్తంగా అందరి మనుసుల్ని కదిలిస్తోంది. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు […]
దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు. […]
దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎడారిగా మార్చిన తెలంగాణ ద్రోహివి అని కేసీఆర్ ను విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. లక్ష కోట్లు మింగి కాళేశ్వరాన్ని కట్టావని.. జూరాల, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం మొత్తం నీటిని దోచుకుంటుందని దాని గురించి మాట్లాడటం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని.. మీ పార్టీలో ఏక్ నాథ్ […]
రోజులు దగ్గర పడ్డప్పుడు మాటలు ఇలాగే వస్తాయని.. జోగులాంబ అమ్మవారిని కంచపరిచే స్థాయికి చేరావ్ అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జోగులాంబ అమ్మవారిని తిట్టే స్థాయికి, వ్యంగంగా మాట్లాడే స్థాయికి వచ్చావంటే ఈ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.. ఫామ్ హౌజ్ లో పడుకోవాలని సలహా ఇచ్చారు. హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేకపోతే కరీంనగర్ లో పట్టిన గతే పడుతుందని అన్నారు. […]
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ కళాశాలలు ఇలా అన్ని విద్యాసంస్థలు జూలై 11 నుంచి […]