దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు చెబుతున్నారు. అధ్యక్ష, పీఎం భవనాలను ఆక్రమించుకున్న…
తాను తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటు వరద బాధితులకు సహాయం చేస్తా అని అన్నారు. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటన ఉండబోతోందని వెల్లడించారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ లో తెలుగు ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని తెలిపారు. విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పోరాడాలని అన్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరద బాధితులు ఉన్నారని.. అయితే ఆదుకునే నాయకుడు మాత్రం లేదని
తన కూతురిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతుందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి అయిన తన కూతురుని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని.. ఆమె క్యారెక్టర్ ను హత్య చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను 2014, 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడమే తప్పు అని.. అందుకే నా కూతురుపై కాంగ్రెస్ ఇలాంటి…
Kallakurichi Student Death: తమిళనాడులో 12 తరగతి విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రికత్తలకు కారణం అయింది. ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థినికి మద్దతుగా విద్యార్థులు తీవ్ర హింసాత్మక ఘటలనకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థిని మరణానికి ఉపాధ్యాయులే కారణం అని స్టూడెంట్స్ తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే శనివారం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు అధికారులు.
Congress blames Union Minister Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె కుమార్తె గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్మృతి ఇరానీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. స్మృతి ఇరానీ కూతురు.. గోవాలో అక్రమంగా బార్ నడుపతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.
మూడు వాారాలుగా అరుణాచల్ ప్రదేశ్, చైనా బోర్డర్ లో కనిపించకుండా పోయిన 19 మంది కూలీల్లో ఏడుగురు కూలీలను భారత వైమానికి దళం రెస్క్యూ చేసింది. కూలీలు కనిపించకుండా పోయిన ప్రాంతం చైనా సరిహద్దుకు అతిసమీపంలో ఉండటంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నెల ప్రారంభంలో ఎల్ఏసీ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ మారుమూల జిల్లా కురంగ్ కుమే జిల్లాలో అస్సాంకు చెందిన 19 మంది కూలీలు తప్పిపోయారు.
Asaduddin Owaisi's comments on PM Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర నేపథ్యంలో యాత్ర మార్గంలో మాంసం దుకాణాలు మూసివేయడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కన్వర్ యాత్రంలో భాగంగా యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలను జూలై 18 నుంచి జూలై 27 వరకు మూసివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అసదుద్దీన్ విరుచుకుపడ్డారు.
పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది.
Mukesh Ambani Family Security Case: పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది.
monkeypox-New England Journal of Medicine study: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు కేసులు నమోదు అయ్యాాయి. కేరళలో ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 15,400 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) రెండోసారి సమావేశం నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం మంకీపాక్స్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.