Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు. జట్టు ప్రయోజనం అనేది అన్నిటికంటే ముఖ్యం.. వైస్ కెప్టెన్ అనే హోదా ఆ నిర్ణయానికి అడ్డుగా ఉండకూడదన్నారు. టీం ఎంపికలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించారు.
Read Also: Cute Kids Conversation: నవ్వులు పూయిస్తిన్న ఇద్దరు చిన్నారుల సంభాషణ
అయితే, 2025 ఆసియా కప్ టోర్నీమెంట్ గిల్ మళ్లీ టీ20 జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు.. ఇక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను బెంచ్ కి పరిమితం చేశారని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. గిల్ పెద్దగా రాణించకపోగా.. ఇప్పటి వరకు ఒక్క టీ20 అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు.. ఒక్క మ్యాచ్‌లో కూడా రెండు సిక్సులకంటే ఎక్కువ కొట్టలేకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో అయితే గిల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టాడు అని కైఫ్ ఎద్దేవా చేశారు.
Read Also: Jayashankar Bhupalpally: భార్యను చంపి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త..
ఇక, గిల్ ఆట తీరును చూస్తుంటే.. “స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడం, ముందుకు వచ్చి మిస్‌టైమ్ కావడం, అభిషేక్ శర్మలా ఆడాలని ప్రయత్నించి ఔటవ్వడం వంటివి అన్నీ చేశాడని మహ్మద్ కైఫ్ విమర్శించారు. ఇప్పుడు అతడికి కొంత విశ్రాంతి ఇచ్చే సమయం వచ్చింది.. అలాగే, సంజూ శాంసన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించారు. సంజూ టాప్ క్వాలిటీ ప్లేయర్.. అతడికి తగినన్ని అవకాశాలు రావడం లేదు.. వైస్ కెప్టెన్లు కూడా గతంలో జట్టు నుంచి తప్పించబడిన సందర్భాలు ఉన్నాయి.. జట్టు ప్రయోజనార్థం గిల్‌ను రెస్ట్ ఇచ్చి.. మరో ఆటగాడిని టీంలోకి తీసుకురావడంలో తప్పేమీ లేదని మాజీ ఆటగాడు కైఫ్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో టీ20 జట్టు ఎంపికపై మళ్లీ చర్చ కొసాగుతుంది.