Langya henipavirus: చైనా వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యాయి. దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ విస్తరిస్తోంది. ఈ రెండు ప్రావిన్సుల్లో ప్రజలుకు ఈ వ్యాధి సోకినట్లు చైనా మీడియా మంగళవారం ప్రకటించింది. లాంగ్యా హెనిపా వైరస్ ను లేవిగా…
ISIS Planning Terror Attack On August 15: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి పాల్పడాలని ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ డే వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ కుట్ర చేసింది. అయితే ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Nitish Kumar will take oath as Chief Minister of Bihar today: బీహార్ రాష్ట్రంలో మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీతో జట్టు కట్టబోతున్నారు. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు 8వసారి నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గవర్నర్ ను కలిసిన నితీష్ కుమార్.. తనకు ఆర్జేడీ, కాంగ్రెస్,…
Sri Lanka To Raise Electricity Rates: శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో అల్లాడుతున్న జనానికి మరో షాక్ ఇచ్చింది శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డ్(సీఈబీ). తన నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపై భారాన్ని మోపింది. ఏకంగా 264 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరింత భారాన్ని మోయాల్సిన పరస్థితి ఏర్పడింది. 616 మిలియన్ డాలర్ల మేర పేరుకుపోయిన బకాయిల నుంచి బయటపడేందుకు సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే…
BJP worker arrested by yogi government: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ మహిళపై బీజేపీ నేత దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యోగీ సర్కార్ బుల్డోజర్లతో యాక్షన్ మొదలు పెట్టింది. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన సొంత పార్టీ నేతపైనే చర్యలు తీసుకుంది. నోయిడాలోని సెక్టార్ 93 బిలోని గ్రాండ్ ఓమాక్స్ హౌజింగ్ సొసైటీలోని బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణ చేసిన శ్రీకాంత్ త్యాగి ఇంటిని ముందర…
Bihar Political Crisis: ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లేందుకే సిద్ధ పడింది. తాజాగా సీఎం నితీష్ కుమార్, బీజేపీతో బంధాన్ని తెంచేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహన్ తో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. బీజేపీతో అధికారం తెంచేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం నితీష్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ మహా…
Bihar Politics: బీహర్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. బీజేపీ పార్టీని కాదని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతున్నారు నితీష్ కుమార్. దీంతో బీజేపీ కూడా అతివేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీహార్ రాజకీయంలో స్పీకర్ కీలకంగా మారాడు. దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆదివారం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించాడు.…
Bihar Politics: బీజేపీతో జేడీయూ దాదాపుగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఈరోజు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు నితీష్ కుమార్. బీజేపీ కూటమితో ప్రభుత్వంలో ఉండటం తన మనుగడకే ముప్పు వాటిల్లుతోందని.. జేడీయూ అభిప్రాయపడుతోంది. దీంతో పాటు ఇటీవల ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. చేస్తూ.. చేస్తూ..నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే జేడీయూ అదిరిపోయే వార్త చెబుతానంటూ నితీష్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఇందుకు బలం కూర్చేలా నితీష్ కుమార్…
Free Bus Ride For Women: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే నేరస్తులకు, మాఫియాకు ఎంతటి భయమో అందరికి తెలుసు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితుల ఇంటి ముందుకు బుల్డోజర్లు క్యూ కడుతాయి. శాంతి భద్రతల విషయంలో యోగి ఎంత నిక్కచ్చిగా ఉంటారో.. సంక్షేమ పథకాలు కార్యక్రమాల్లో కూడా తన మార్క్ చాటుకుంటున్నారు. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... రెండో సారి యూపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు.
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర బీజేపీ- శివసేన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ మంత్రి వర్గ కూర్పు ఖారైంది. ఇరు పక్షాలు చెరో 9 మంత్రి పదవులను పంచుకున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా 18 మందిని మంత్రి పదవులు వరించనున్నాయి. రెండు భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా ఇరు పక్షాలు చెరి సమానంగా మంత్రి పదవులు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ, శివసేన పార్టీ నుంచి 9 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా…