Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభం అయి ఏడు నెలలకు చేరినా.. ఇరు వైపుల దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. సెంట్రల్ ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో రష్యా దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించినట్లు స్థానిక గవర్నర్ వాలెంటివ్ రెజ్నిచెంకో తెలిపారు. రష్యా దాడుల్లో 11 మంది అక్కడిక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ కు నుంచి డ్నీపర్ నదికి…
Prashant Kishor comments on bihar politics: బీహార్ రాష్ట్ర రాజకీయాలపై, నితీష్ కుమార్- ఆర్జేడీ కూటమి, 2024 ఎన్నికలకై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాలలో ఇప్పడు స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013-14 నుంచి బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు ఇది ఆరోసారి అని.. గత 10 ఏళ్ల నుంచి బీహార్ లో రాజకీయ అస్థిరత నెలకొందని ఆయన అన్నారు.…
Supreme Court grants bail to Varavara Rao: హక్కుల నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో వరవర రావుకు ఊరట లభించింది. అనారోగ్యం, వయసు, మధ్యంతర బెయిల్ దుర్వినియోగం చేయకపోవడవంతో శాశ్వత బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఉదయ్ లలిత్ నేత్రుత్వంలోని ధర్మాసంన అనారోగ్య కారణాల వల్ల శాశ్వత బెయిల్ మంజూరు చేసింది.
BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Corbevax approved as precaution dose for adults: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమలో మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. బయోటాజికల్ ఇ సంస్థ తయారు చేసిన ‘కార్బెవాక్’ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికి బూస్టర్ డోస్ గా కార్బెవాక్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రాథమికంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కార్బెవాక్ ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని వెల్లడించింది. ఇలా మొదటగా ఓ వ్యాక్సిన్…
Priyanka Gandhi tests positive for Covid-19: కాంగ్రెస్ కీలక నేత, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకు ముందు ఈ ఏడాది జూన్ లో ప్రియాంకా గాంధీ కోవిడ్ బారినపడి కోలుకున్నారు. తరువాత నెల వ్యవధిలోనే మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు.
COVID 19 CASES UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య గతం రోజుతో పోలిస్తే పెరిగాయి. నిన్న 12,751 వేల కేసులు నమోదు అవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19,539 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261గా ఉంది. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మహమ్మారి బారిన పడి 54 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు…
Pakistan batter Sohaib Maqsood comments on India wins against pak: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోరంటే ఇరు దేశాలకు ఎంతో కీలకం. ఈ రెండు జట్ల మధ్య పోటీపై క్రీడా ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. అయితే ప్రపంచ కప్ టోర్నీల్లో ఒక్కసారి తప్పితే భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ పై ఆదిపత్యం చెలాయిస్తూ గెలుస్తూ వచ్చింది. 2022 టీ 20 ప్రపంచ కప్ లో చివరి సారి పాకిస్తాన్, ఇండియా చివరి సారిగా తలపడ్డాయి. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్, భారత్…
Mother and Son To Join Government Service Together: కేరళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇద్దరు కలిసి క్లాసులు వెళ్లడం, కలసి చదవడంతో పాటు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దీంతో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన బిందు (45), ఆమె కొడుకు వివేక్(24) ఇద్దరు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి ఒకేసారి ఉద్యోగాలను సంపాదించారు.
Encounter underway in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రారంభం అయిన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా వాటర్ హైల్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. లష్కరే తోయిబా/ ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి…