Bihar Political Crisis: ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లేందుకే సిద్ధ పడింది. తాజాగా సీఎం నితీష్ కుమార్, బీజేపీతో బంధాన్ని తెంచేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహన్ తో సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. బీజేపీతో అధికారం తెంచేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం నితీష్ కుమార్ తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం. దీంతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ మహా ఘట్ బంధన్ కూటమి బీహర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అయింది.
ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీయాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము వెంటే ఉంటామని మద్దతు పలికారు. ఇక జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సీఎం నితీష్ కుమార్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతాం అని తెలిపారు. దీంతో ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
Read Also: Bihar Politics: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. ఒక రోజులోనే కోవిడ్ నుంచి కోలుకున్న స్పీకర్
సాయంత్రం 4 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన నితీష్ కుమార్.. ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య .. ‘‘రాజతిలకానికి సిద్ధం కండి.. బీహార్ లో లాంతర్( ఆర్జేడీ గుర్తు) పాలన వస్తుంది’’ అంటూ ట్వీట్ చేయడం ఇక బీహార్ లో మహా ఘట్ బంధన్ ప్రభుత్వం రానున్నట్లు చెప్పకనే చెప్పారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ సైలెంట్ గా ఉంది. అయితే బీజేపీ నెక్ట్ వ్యూహం ఏంటనేది ఇంకా అంతు చిక్కడం లేదు. అయితే 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో జేడీయూకు 45, ఆర్జేడీకి 79, కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు, బీజేపీకి 77 స్థానాలు ఉన్నాయి. దీంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈజీగా మ్యాజిక్ ఫిగర్ 122 ను క్రాస్ చేయనున్నాయి.