Jagdeep Dhankhar Takes Oath As Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కొత్తగా ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగ్దీప్ ధన్కర్ కు నేతలు…
TMC leader arrested by CBI: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ కీలక నేత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అరెస్ట్ చేసింది. గురువారం బీర్భూమ్ లోని అతని నివాసంలో సీబీఐ అనుబ్రతా మోండల్ ను అదుపులోకి తీసుకుంది. పశువుల అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్ట్ చేసింది. 2020లో సీబీఐ పశువుల అక్రమ రవాణా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Crimes against women increased in delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఆడవారిపై అత్యాచారాలు, వేధింపుల కేసులు పెరిగాయి. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే.. ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీలో 2022లో మొదటి ఆరు నెలల్లో 1100 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు 1480 మహిళా వేధింపుల కేసులు నమోదు అయ్యాయి
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి టూరిస్ట్ వీసాపై సింగపూర్ లోనే ఉంటున్నాడు…
Corona Cases In India: దేశంలో గత రోజుతో పోలిస్తే స్వల్పంగా రోజూవారీ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,299 మందికి కరోనా సోకింది. అంతకు ముందురోజు 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 53 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076గా ఉంది.
Kim Jong Un's Sister Warns south korea: ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న చెల్లిలు.. శక్తివంతమైన నాయకురాలు యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా వల్లే ఉత్తర్ కొరియాలో కోవిడ్ ప్రబలిందని ఆమె ఆరోపించారు. అయితే కోవిడ్ వ్యాధిని ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని ఆమె అన్నారు. తాజాగా కిమ్, ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కోవిడ్ పై విజయం సాధించామని…
Jagdeep Dhankhar will take oath as the Vice President: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కొత్తగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్ చేత గురువారం ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుపున పోటీ చేసి ధన్ కర్, యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించారు.
Terrorist Suicide Attack On An Army Company Operating Base: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ క్యాంపు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాలని అనుకున్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డగించాయి. గతంలో ఉరీ తరహా దాడికి ప్రయత్నించేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. రాజౌదీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపు కంచెను దాటేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఘటన జరిగిన ప్రదేశం దర్హాల్ పోలీస్ స్టేషన్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజౌరీ…
Samsung Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 launched: సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం సామ్ సంగ్ తన ప్రీమియం ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ ప్లిప్ 4ను అధికారికంగా లాంచ్ చేసింది. సామ్ సంగ్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఫోన్లలో అత్యధిక ధర కలిగిన ప్రీమియం ఫోన్లు ఇవే. అయితే సెప్టెంబర్ నుంచి ఇండియాలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Kim Jong Un Declares Shining Victory Over Covid: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశంలోని కోవిడ్ పరిస్థితులపై అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. దాదాపుగా గత రెండు వారాల నుంచి కొత్తగా వైరస్ కేసులు లేవని.. అధికారులు ప్రకటించిన తరువాత దీన్ని గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రాణాంతక మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విజయం సాధించామని ప్రకటించారని అధికారిక వార్త సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. గత మేలో నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ తో పాటు దేశంలో కరోనా…