Langya henipavirus: చైనా వూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయి. కరోనా వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యాయి. దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ విస్తరిస్తోంది. ఈ రెండు ప్రావిన్సుల్లో ప్రజలుకు ఈ వ్యాధి సోకినట్లు చైనా మీడియా మంగళవారం ప్రకటించింది. లాంగ్యా హెనిపా వైరస్ ను లేవిగా కూడా పిలుస్తారు. చైనా తూర్పు ప్రాంతంలో ఈ వైరస్ కేసులు బయటపడుతున్నాయి.
ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. తూర్పు చైనా ప్రాంతంలో జ్వరంతో బాధపడుతున్న పలువురిని పరిశీలించగా.. లాంగ్యా హెనిపా వైరస్ బయటపడినట్లు గ్లోబల్ టైమ్స్ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు షాన్ డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 లాంగ్యా హెనిపావైరస్ కేసులు బయటపడ్డాయి. 26 మంది జ్వరం, దగ్గు తలనొప్పి, వాంతులతో బాధపడుతున్నారని చైనా మీడియా తెలిపింది.
Read Also: Uttar Pradesh: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి ఐసిస్ ప్లాన్
జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్ వల్ల మనుషుల్లో తీవ్ర జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని.. అయితే ఈ వ్యాధికి ప్రస్తుతం వ్యాక్సిన్ కానీ చికిత్స కానీ లేదని.. లక్షణాలను బట్టి చికిత్స మాత్రమే ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే వైరస్ ప్రాణాంతకమైదని కాదని.. భయపడాల్సిన అవసరం లేదని చైనా నిపుణులు చెబుతున్నారు.