PM Narendra Modi Comments in NITI Aayog Meeting: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2020 మార్చి కరోనా లాక్ డౌన్ తర్వత తొలిసారిగా ముఖాముఖీ సమావేశం జరిగింది. అంతకు ముందు కేవలం వర్చువల్ సమావేశాలే జరిగాయి. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడిలో దేశంలోని రాష్ట్రాలు…
Pakistan Woman Sends Rakhi For PM Modi: పాకిస్తాన్ మహిళ మరోసారి ప్రధాని మోదీకి రాఖీ పంపించింది. కమర్ మోహ్సీన్ షేక్ ప్రధాని మోదీకి రాకీ పంపింది. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ విజయం సాధించాలని కోరుకుంది. ఈ సారి ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ సారి ప్రధాని మోదీ తనను ఢిల్లీ పిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎంబ్రాయిడరీ డిజైన్ తో కూడిన రేష్మీ రిబ్బన్ ను ఉపయోగించి స్వయంగా తానే రాఖీ…
Father Try to Kill Own Daughter in Uttar Pradesh: లవ్ ఎఫైర్ పెట్టుకుందని సొంత కూతురినే తుదముట్టించేందుకు ప్రయత్నించాడో తండ్రి. కాంట్రాక్ట్ కిల్లర్ కు సుపారీ ఇచ్చి కూతురును హత్య చేయించేలా పథకం వేశాడు. అయితే చివరకు తండ్రితో పాటు కాంట్రాక్ట్ కిల్లర్ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ మీరట్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల మాట కాదని ఓ వ్యక్తిని ప్రేమిస్తూ.. అతనితో సంబంధం నెరుపుతోంది. అయితే తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ఎంత కోరినా…
Lightning Strike on Fuel Tank: లాటిన్ అమెరికా దేశం క్యూబాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చమురు నిల్వ కేంద్రంపై పిడుగుపాటుకు గురవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం ఒకరు మరణించగా.. 121 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారు. ఇంధన నిల్వ కేంద్రం చుట్టు పక్కల ఉన్న 1900 మందిని సురక్షితన ప్రాంతాలకు తరలించారు.
Missing Girl Is Reunited With Her Family After 9 Years.విధి ఎంత విచిత్రంగా ఉంటుందంటే.. ఏడేళ్ల వయసులో కిడ్నాప్ కు గురైనా బాలిక, తన తల్లిదండ్రులు నివసించే ఏరియాలో కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్నా, తన కుటుంబాన్ని కలవడానికి తొమ్మిదేళ్లు పట్టింది. వివరాల్లోకి వెళితే జనవరి 22, 2013లో ముంబై అంధేరిలో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలిక పూజ, అతని సోదరుడితో స్కూలుకు వెళ్లింది. ఈ క్రమంలో హెన్రీ డిసౌజా అనే వ్యక్తి పూజకు ఐస్ క్రీమ్ కొనిస్తానని నమ్మించి…
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చ
SSLV-D1 carrying Earth Observation Satellite is No longer usable: ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలం అయినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ డీ1 ద్వారా రెండు శాటిలైట్లను ఈ రోజు నింగిలోకి ప్రయోగించింది. అయితే మొదటి మూడు దశలు సక్సెస్ ఫుల్ గా సాగాయి. అయితే టెర్మినల్ స్టేజీలో మాత్రం ఉపగ్రహాలతో గ్రౌండ్ స్టేషన్ కు సంబంధాలు తెగిపోయాయి. మూడో దశ తరువాత ఈఓఎస్ 2, ఆజాదీ ఉపగ్రహాలను కక్ష్య లోకి విడిచిపెట్టింది. అయితే ఆర్బిట్ లోకి చేరిన తర్వాత ఉపగ్రహాల…
Sadguru wrote a letter to Joginapally Santosh Kumar: దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి రాసిన లేఖలో “సేవ్ సాయిల్ మూమెంట్” సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు.
Bimbisara - Sitharamam:శుక్రవారం విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు ఈ రెండు సినిమాల కారణంగా కళకళలాడుతున్నాయి. దాంతో చిత్రసీమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ ను ఆపేసి, తమ సమస్యలపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
NTR Family Sentiment:ఇటీవల నటరత్న యన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో యన్టీఆర్ కుటుంబానికే 'ఆగస్టు నెల అచ్చిరాదు' అని కొందరు టముకు వేశారు. యన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రెండు సార్లు ఆగస్టులోనే బర్తరఫ్ కావడంతో ఈ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే చిత్రసీమలో యన్టీఆర్ కు, ఆయన నటవారసులకు కూడా ఆగస్టు నెల అచ్చివచ్చిందనే చెప్పాలి.