COVID 19 UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,751 మంది వైరస్ బారిన పడ్డారు.…
Death Threat To UP CM,ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఆగస్టు 2న లక్నో కంట్రోల్ రూంలోని వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కు ఓ బెదిరింపు మెసేజ్ వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తామని హెచ్చరికలు చేశారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఉన్నతస్థాయి విచారణ చేస్తున్నారు.
Donald Trump Florida House Raided By FBI: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రింప్ ఇంటిలో ఎఫ్ బీ ఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఉన్న ట్రంప్ ఇళ్లు మార్-ఏ- లాగోలో ఎఫ్ బీ ఐ ఏజెంట్లు దాడులు చేశారు. అయితే ఈ చర్యను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ల దాడిగా తన సొంత సోషల్ మీడియా ట్రూట్ సోషల్ లో పోస్ట్ చేశాడు. అయితే ఎఫ్ బీ ఐ…
Bihar Politics: బీహార్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుందా.. అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీని బీజేపీ చీల్చేందుకు ప్రయత్నిస్తుందంటూ జేడీయూ అభద్రతా భావానికి గురవుతోంది. దీంతో బీహార్ లో సంయుక్తంగా అధికారంలో ఉన్న బీజేపీ-జేడీయూ పార్టీ బంధానికి బీటలు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లుగానే ఉన్నాయి.
Hindu family in Pakistan attacked by politician’s relative: పాకిస్తాన్ లో హిందూ మైనారిటీలపై దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని హిందూ మైనారిటీల సంఖ్య కేవలం 1-2 శాతానికి పడిపోయింది. గతంలో పాకిస్తాన్ లో హిందూ జనాభా 10 శాతం కన్నాఎక్కువగా ఉండేవారు. అయితే మెజారిటీ వర్గం వేధించడంతో చాలా మంది బలవంతంగా మతం మారారు. మరికొన్ని సార్లు హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని మతం మార్చారు. ఇదిలా ఉంటే […]
Sun Is Angry: సూర్యుడిపై వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. గత రెండు వారాల్లో సూర్యుడిపై 36 భారీ విస్పోటనాలు ( కరోనల్ మాస్ ఎజెక్షన్స్), 14 సన్ స్పాట్స్, 6 సౌర జ్వాలలు వెలువడ్డాయి. ఇందులో కొన్ని భూమిని నేరుగా తాకగా.. మరికొన్ని భూమికి దూరంగా వెళ్లాయి. భూమిపైన సమస్త జీవరాశికి, సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలకు శక్తినిచ్చే సూర్యుడు.. ఇటీవల కాలంలో భారీ స్థాయిలో శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సోలార్ సైకిల్ కి దగ్గర పడే…
Indian-origin woman incident in New York: న్యూయార్క్ లో భారత సంతతి మహిళ ఆత్మహత్య వ్యవహారం వైరల్ గా మారింది. కేవలం ఆడపిల్లలు పుడుతున్నారనే నెపంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోను తీసుకుని తన బాధనంతా వెళ్లకక్కింది. భర్త మారుతాడని ఎదురుచూసిన ఆ యువతికి ఇక మారడనే విషయం తెలిసి.. రోజూ ఈ నరకాన్ని అనుభవించే కన్నా మరణించింది మేలనుకుని ఆత్మహత్య చేసుకుంది. మన్ దీప్ కౌర్( 30) తన బాధనంతా తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది.…
Joe Biden Tests Negative For Covid: అమెరికా అధ్యక్షుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. జూలై 20 నుంచి తొలిసారిగా ఇప్పుడే బయటకు వచ్చాడు. తాజాగా ఆదివారం చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చింది. వరసగా రెండు రోజుల పాటు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. జూలై 20న జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారు. ఇదిలా ఉంటే జూలై 30…
Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది.
India objected to China's Yuan Wang 5 ship: భారత్ ఒత్తడికి శ్రీలంక తలొగ్గింది. శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయానికి అత్యాధునికి చైనా నౌక ‘యువాన్ వాంగ్ 5’ రావడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ ట్రాకింగ్ పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5 ఆగస్టు 11 నుంచి 17 వరకు హంబన్ టోట పోర్టులో ఉండాల్సి ఉంది. అయితే ఈ నిఘా నౌక భారత్ పై కూడా నిఘా పెడుతుందని మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ మహాసముద్రంలో