Samsung Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 launched: సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం సామ్ సంగ్ తన ప్రీమియం ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ ప్లిప్ 4ను అధికారికంగా లాంచ్ చేసింది. సామ్ సంగ్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఫోన్లలో అత్యధిక ధర కలిగిన ప్రీమియం ఫోన్లు ఇవే. అయితే సెప్టెంబర్ నుంచి ఇండియాలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫీచర్స్, ధర:
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 గ్లోబల్ లాంచ్ ధర దాదాపుగా రూ. 1.42 లక్షలుగా ఉంది. గతంలో జెడ్ ఫోల్డ్ 3 ధర ఇండియాలో రూ. 1.42- రూ. 1.57 మధ్య ఉంది. అయితే కొత్తగా వస్తున్న జెడ్ ఫోల్డ్ 4 ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం అవుతుండటంతో ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశమే కనిపిస్తోంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. 6.2 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లేతో పాటు 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెనరేషన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఎల్ ఆపరేటింగ్ సిస్టమ్, 50 ఎంపీ+12ఎంపీ+ 10 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 4 ఎంపీ+10 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

Read Also: Kim Jong Un: కోవిడ్ పై విజయం సాధించామంటున్న కిమ్..
గెలాక్సీ ఫ్లిప్ 4 ఫీచర్స్, ధర:
గెలాక్సీ ఫ్లిప్ 4 గ్లోబర్ లాంచింగ్ ధర రూ. 80,000 ఉంది. గతంలో గెలాక్సీ ఫ్లిప్ 3ని ఇండియాలో రూ. 84,999- రూ. 88,999 మధ్య విక్రయించారు. ఈసారి ఈ ధరలను మించి ఇండియన్ మార్కెట్ లో ఫ్లిప్ 4 ధర ఉండనుంది.

6.7 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లే, 1.9 అంగుళాల సెకండరీ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 12ఎంపీ+12ఎంపీ డ్యుయర్ రియర్ కెమెరా, 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,700ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో రానుంది.